దక్షిన తెలంగాణ

జీవన సంధ్యలో..( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం ఏడు గంటలకు పేపర్ తిరగేస్తూ..కాఫీ సేవిస్తున్నాను.. రాత్రి గుడిలో వృద్ధ మహిళల మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొస్తోంది. జీవన సంధ్యలో వున్న వాళ్ల దయనీయస్థితి ఒకింత నన్ను కదిలించింది.
‘ఈ మధ్య గుడికి బాగా వస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుందా? అని అడిగింది విమలమ్మ..
‘రాక తప్పదుగా..’ అంది కమలమ్మ..‘ఏంటి అలా అంటున్నారు..ఏమిటీ నాకర్థం కాలేదు’ అంది విమలమ్మ.
‘దీనిలో అర్థమయ్యేది ఏముందండి? కొడుకులు మన వాళ్లయినంత మాత్రాన కోడళ్లు మన వాళ్లుగా ఉంటారా? అంది కమలమ్మ..
‘ఏమిటో కొంచెం వివరంగా చెప్పండి’ అంది విమలమ్మ..
కొడుకు ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. కోడలు క్లబ్‌కు వెళ్తూ..‘నీ ఒక్కదానికి వంట ఎందుకు? అత్తమ్మ..గుడికి వెళ్లి..అక్కడ ఇచ్చే ప్రసాదంతో సరిపెట్టుకోండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చింది. అంతేగాదు తాను క్లబ్‌కు వెళ్తూ గుడి వద్ద దించి వెళ్లింది’ అని అంది. అంతటితో ఆగక..‘మీ ఆరోగ్యం ఎలా ఉంది? అని ప్రశ్నించింది కమల్మమ్మ..
‘ఏం ఆరోగ్యమమ్మా..ఒంట్లో రోజు రోజుకు శక్తి క్షీణిస్తోంది..అయిన గొంతులో ప్రాణం వున్నవరకు ఏదో ఒకటితిని బతకాలిగా’ అంది విమలమ్మ..
‘మీ కొడుకు, కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? అంది కమలమ్మ..
‘ఏం చెప్పమంటావమ్మా.. రోలు వచ్చి మద్దెలకు చెప్పుకున్నట్లుంది అంది విమలమ్మ..
‘అర్థం కాలేదు కొంచెం వివరంగా చెప్పుమని కోరింది కమలమ్మ..
చెప్పుకోవడానికి ఏముందిలే..ఇది నా తల రాత..కొడుకు, కోడలు ఇద్దరు కలిసి రెస్టారెంట్‌లో ఓ బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ నన్నిక్కడ దించేసారు..నాకు గ్యాస్ స్టౌవ్ వెలిగించడం చేతకాదని వాళ్లకు తెలుసు. ఒక్కదానివి ఇంట్లో ఎందుకు హాయిగా గుడికెళితే..స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయి. గుడికెళ్లు అమ్మ అక్కడ పారాయణం వింటే పుణ్యం వస్తుంది. ప్రసాదంతో కడుపు నిండుతుందని పుత్రరత్నమే చొరవ తీసుకుని నన్ను దించి వెళ్లాడు. వాడితో కోడలు వెళ్లింది. అని కళ్లలో సుడులు తిరుగుతున్న నీటిని కొంగుకు అద్దుకుంటూ చెప్పింది విమలమ్మ..
వెంటనే కమలమ్మ సంభాషణను కొనసాగిస్తూ..‘మా ఆయనకేం హాయిగా ముందు స్వర్గానికి వెళ్లిపోయాడు..పోతూ పోతూ..బ్యాంక్ బ్యాలెన్స్..ఉందిగా కొడుకు, కోడలు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు’ అని చెప్పినారు. కానీ, ఆయన కన్న కల కల్లలయ్యేలా కొడుకు, కోడలు అసలే పట్టించుకోవడం లేదు’ అంది కమలమ్మ..
‘అయ్యో అలాగా..నా పరిస్థితి అంతే’ అంటూ శృతి కలుపుతూ నిజమే కదూ..అందుకే అన్నారు పోయినోల్లందరూ మంచివాళ్లు..అంది. విమలమ్మ.
‘ఔను వాళ్లు పై లోకంలో బాగానే వున్నారు. కాటికి కాళ్లు చాపే ఈ వయసులో మనకే ఈ కష్టాలు’ అంది కమలమ్మ.
అంతలోనే పూజ పూర్తయి ప్రసాదం గంట మ్రోగింది. ఒక్కొక్కరు వరుసలో వచ్చి తీర్థ, ప్రసాదాలు తీసుకుంటున్నారు. వరుసలో వెళ్లి తీర్థం పుచ్చుకుని దోసిల్లలో ప్రసాదాన్ని స్వీకరించారు..కళ్లకద్దుకుని ఓ మూలన కూర్చొని ఆరగించి కడుపునిండిందని భావించి అక్కడి నుండి నిష్క్రమించారు.
ఇలా నిన్న గుడిలో జరిగిన వృద్ధుల సంభాషణనే నా మనసులో ఇంకా కదలాడసాగింది. మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి. మమతానురాగాలు మాయమై పోతున్నాయి..ఇలాగే కొనసాగితే..రాను రాను వయసుమళ్లిన తల్లిదండ్రుల గతి అధోగతే కదా! అంటూ నా మదిలో ఆలోచనలు ఆర్ధ్రంగా నన్ను స్పృశిస్తున్నాయి.
ఇంతలో..
‘ఏమండి స్కూలుకు టైం అవుతోంది. పిల్లల్ని నిద్రలేపండి’ అని భార్యామణి పిలుపు విన్న నేను..పిల్లల బెడ్ రూం వైపు అడుగులేశా..!

*
- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551
**

పుస్తక సమీక్ష
*
శ్రీ ఆంజనేయోదాహరణము
ప్రతులకు:
బండకాడి అంజయ్య గౌడ్
గ్రామం: వెంకట్రావుపేట
మండలం: తాగుట
జిల్లా: సిద్ధిపేట
సెల్.నం.9885841905
*
సిద్ధిపేట జిల్లా వెంకట్రావుపేటకు చెందిన కవి శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ ‘శ్రీ ఆంజనేయోదాహరణము’ పేరుతో ఓ ఉదాహరణ కావ్యాన్ని వెలువరించారు. పద్య రచనలో అనుభవమున్న కవి బండకాడి అంజయ్య గౌడ్ గారు హనుమదోదహరణం రచించి సంప్రదాయ కవుల్లో ఒకరిగా నిలవడం ముదావహం! తెలుగు సాహిత్యంలో ‘ఉదాహరణం’ అనేది ఒక చాటు ప్రబంధ విశేషంగా చెప్పబడిన శతక ప్రక్రియ! విలక్షణమైన ఈ ప్రక్రియను తెలంగాణకు చెందిన పాల్కురికి సోమనాథుడు సుసంపన్నం చేశారు. ‘ఉదాహరణం’ ప్రక్రియ కవి తన ప్రతిభను ప్రదర్శించడానికి ఓ మంచి సాధనం! 24 పద్యాలతో ఉదాహరణం ప్రక్రియ ప్రథమావిభక్తి మొదలు మొత్తం ఎనిమిది విభక్తులలో ఒక్కో విభక్తికి మూడు పద్యాల చొప్పున వెలుగొందుతుంది.
కవి యొక్క ఛందో పరిజ్ఞానానికే కాక..వ్యాకరణ పటిమకు నిదర్శనంగా నిలిచే ఈ ప్రక్రియను ఆదరించి..అలవోకగా కవి బండకాడి అంజయ్య గౌడ్ గారు శ్రీ ఆంజనేయోదాహరణమును రచించారు. అంజయ్య గారు ప్రయోగించిన పదబంధాలు సరళంగాను.. సుకుమార శోభితంగా ఈ లఘుకావ్యంలో ఒదిగి పోయాయి! ఆంజనేయుడు స్వామి భక్తి పరాయణుడే కాదు.. దేశభక్తికి మారు పేరని.. అతనికి శ్రీరాముడే సర్వస్వమనీ.. అతని సేవకంటే మరోమార్గం లేదని..స్వామి కార్యమే స్వకార్యంగా భావించిన విషయాన్ని కవి ఈ కావ్యంలో చక్కగా ఆవిష్కరించారు. అంజయ్య గౌడ్ గారు వృత్త రచనలోనూ..కళికోత్కళికల విషయంలోనూ చూపిన మెలకువలు ప్రశంసనీయం! లయబద్ధంగా వుండేలా అంత్యప్రాసలను జోడించడం విశేషం!
కావ్యం చివరన అంకితాంకము పద్యము-సంధులు, చంద శాస్తమ్రుల సారమెరుంగక.. భక్తితోడుతన్ ఈ కావ్యాన్ని వ్రాశానని వినయంగా కవి ప్రకటించుకోవడం ప్రశంసనీయం! అక్కడక్కడ అక్షర దోషాలున్నప్పటికీ.. పాఠకులు వాటిని సరిచేసుకుని చదవడానికి యోగ్యంగా ఇందలి రచన వుంది!
*
- సాన్వి,
సెల్.నం.9440525544
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net