దక్షిన తెలంగాణ

కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిన్న నీతో పాటు కనిపించిన అమ్మాయెవర్రా...’
‘నాన్నా..నేనా అమ్మాయిని ప్రేమిస్తున్నా...’
‘ప్రేమించి ఏం జెస్తవ్ బిడ్డా...’
‘పెళ్లి జేసుకుంటా...’
‘నువ్వు సదివేది ఏం తరగతి బిడ్డా...’
‘ఇంటర్...’
‘మరి సదువు పూర్తికాకుండా ఏం జేసి సాదుతావ్ రా...’
‘......’
‘బిడ్డ..నీకో కథ జెప్పుత ఇను..జ్యోతి నీలాగానే మైనర్‌గా ఉండంగనే...ప్రేమిస్తున్నానని వెంటబడిన అతని తోని ఇంట్లో నుండి నగలు, బట్టలు తీసుకుని వెళ్లిపోయింది. సదువు పూర్తిగాలే..ఇద్దరికీ ఏ ఉద్యోగం దొర్కలే..ఒక్కో నగ అమ్మి తిన్నారు. కడుపు నిండినప్పుడు, ప్రేమలో మునిగినప్పుడు అదే లోకమైతది. కానీ ప్రేమ కడుపునింపదు. ఆకలి బాధ ఎంత ఘోరంగా ఉంటాదో తెల్సిన తరువాత అతను ఆమె నొదిలేసి పోయిండు. అమ్మానాన్నలకు మొహం చూపించలేక ఆమె ఉరేసుకున్నది. అతన్ని పోలీసులు పట్టుకెళ్లి జైల్లెసిండ్రు. తండ్రికి నలుగురిలో పరువుపోయిందని ఆలోచించేసరికి పక్షవాతమొచ్చింది. సంపాయించేటోడు మంచం పట్టేసరికి భరించలేక ఇంటిల్లిపాధి వీధినపడ్డరు. ఇక, జ్యోత్స్న ప్రేమ అని వెంటబడేవాళ్ల వలలో పడకుండా కష్టపడి మంచిగా సదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నది. కోలీగ్ ప్రేమిస్తున్నానని చెబితే తండ్రికి చెప్పింది. ఆయన వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడి అందరి ఆశీర్వచనాలతో పెళ్లి చేసిండు. ఎంతో ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ల దీవెనలు చాలా విలువైనవి. శక్తివంతమైనవి. జీవితమన్నాక ఎన్నో కష్టాలొస్తయి. ఎప్పుడైనా వాళ్లు అండగా ఉంటారు. వాళ్లు ఉన్నారనే ధీమా ధైర్యాన్నిస్తది. ఇదివరకు లేని విడాకులు ఇప్పుడెందుకెక్కువైనవో నీకు అర్థమైతాందనుకుంటా. నేను చెప్పినవి సినిమా కథలు కావు.
యదార్థ జీవిత సంఘటనలు. ఏది ఎంచుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉన్నది. వాళ్లు ఇద్దరూ ఎవరో కాదు, మా చిన్నాన్న మనవరాళ్లు. నీకు అక్కలు. ఎప్పటికీ జ్యోతక్క ఎట్లా చచ్చిపోయిందంటే పాము కరిచి అనేవాళ్లం కదా.. ఇది అసలు కథ.
‘మా ప్రేమ అట్లాంటిది కాదు నాన్నా..’ ఆవేశంగా అన్నాడు ప్రణీత్.
‘ప్రేమ అనేది మంట లాంటిది. అది మనస్సును వెచ్చగా ఉంచుతాదా, ఇంటినే కాల్చేస్తాదా అనేది ఎవరేం చెప్పలేరు. ఆనందంలో ఉన్నప్పుడు హామీలను, బాధతో ఉన్నప్పుడు జవాబును ఎట్లా ఇవ్వద్దో, అట్లనే ఆవేశంలో ఉన్నప్పుడూ నిర్ణయాలనూ తీసుకోవద్దు..’
‘నేను ఆలోచించే చెబుతున్నా నాన్నా.. ఎవరు వద్దన్నా, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను..’
‘ప్రేమలో మునిగిన ఈ వయస్సులో మీ ప్రేమ కాదనే ప్రతీ తల్లి తండ్రి మీకు శత్రువుల్లాగే కనిపిస్తారు. కానీ నీ మంచి కోరే వాళ్లలో ముందు స్థానంలో ఉండేది వాళ్లే. ఈ వయస్సులో ఉండేది ప్రేమ కాదు ఆకర్షణ.. లేదు నిజమైన ప్రేమే అనుకుంటే నువ్వు పై చదువులు చదువుకుని మంచి జాబ్ సంపాదించి, జీవితంలో సెటిల్ అయ్యేవరకు ఆగమని ఆమెకు చెప్పు. అప్పటివరకామే గురించి ఆలోచించకు. పదవ తరగతిలో స్కూల్లో ఫస్ట్ వచ్చిన నువ్వు ఇప్పుడు చదువులో వెనకెందుకు పడ్డావో ఆలోచించు.. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయస్సులో చేయాలి. ఆ వయస్సు దాటాక చదువుకోవాలంటే చాలా అడ్డంకులెదురౌతాయి. నువ్వు జీవితంలో సెటిల్ అయ్యాక ఎవరితో కావాలంటే వారితోనే పెళ్లి జరిపించే బాధ్యత నాది. నిర్ణయం నీకే వదిలేస్తున్నా..నాకు తెలుసు నా బిడ్డ చాలా తెలివైన వాడని, ఆలోచించు మంచి నిర్ణయాలు తీసుకుంటాడని..’
‘నాన్నా..ఆలోచించాల్సిన అవసరం లేదు. కళ్ల ముందే భవిష్యత్తు చూపించావు. జ్యోత్స్నక్క లాగే నేను ఉద్యోగం సంపాదించాకే పెళ్లి చేసుకుంటా నాన్నా..’
‘నాకు తెలుసు బిడ్డా.. నా కొడుకు బంగారమని..’ ఆప్యాయంగా హత్తుకున్నాడు కొడుకుని. కాలంకి ఉన్న మహత్తర శక్తి తెలిసిన అనుభవజ్ఞుడతను.

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupumbn@andhrabhoomi.net

- నామని సుజనాదేవి వరంగల్, సెల్.నం.7799305575