ఆంధ్రప్రదేశ్‌

నటుడు మోహన్‌బాబు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సినీ నటుడు మోహన్‌బాబు తన కుమారులు విష్ణు, మనోజ్‌లతో పాటు వందలాది మంది విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. శ్రీవిద్యానికేతన్‌కు దాదాపు రూ.9కోట్ల బకాయిలను చెల్లించకుండా ఏళ్లతరబడి జాప్యం చేస్తుందని పేర్కొంటూ బైఠాయించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలను రకరకాలుగా మళ్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిందని ఇన్నాళ్లు పసుపు-కుంకమ పథకం చేపట్టకుండా కేవలం ఎన్నికల మూడు నెలల ముందు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించేవారైతే వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని అన్నారు.