రాష్ట్రీయం

ముద్రగడ దీక్ష వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల సీజన్ కావడమే కారణం * 2నెలల తరువాత భవిష్యత్ ప్రణాళిక
కాకినాడ, మార్చి 10: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం నుండి నిర్వహించతలపెట్టిన ఆమరణ దీక్షను వాయిదా వేసుకున్నారు. దీక్ష యోచనను విరమించుకోలేదని, పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వాయిదా వేసుకున్నట్టు ఆయన తెలిపారు. రెండు నెలల తరువాత భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ముద్రగడ గురువారం 13 జిల్లాల కాపు నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ముందుగా సుమారు 600 మంది నాయకుల సమక్షంలో చర్చలు జరిపారు. తరువాత కొందరు ముఖ్య నేతలతో ప్రత్యేక చర్చలు జరిపారు. దాదాపు నేతలందరూ దీక్షను వాయిదా వేసుకోవాలని ముద్రగడకు విజ్ఞప్తి చేశారు. ‘మీరంటూ లేకపోతే కాపు జాతికి మరో నాయకుడు లేడు. కాపులను బిసిలలో చేర్పించడం మీ వల్లే సాధ్యం’ అని ఆయా జిల్లాల నేతలు ముద్రగడకు చెప్పారు. ఉద్యమం మళ్ళీ తీవ్రతరమైతే విద్యార్థులకే నష్టం అధికంగా కలిగే ప్రమాదం ఉన్నదని వారు సూచించారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ రాస్తారోకో, ఇతర ఆందోళన కార్యక్రమాల విషయంలోనైతే తాను ఇతరులను సంప్రదిస్తానని, నిరాహార దీక్ష విషయంలో మాత్రం తానెవర్నీ సంప్రదించి నిర్ణయం తీసుకోనన్నారు.
మొత్తం విద్యార్థుల ప్రయోజనం కోసం దీక్షను వాయిదా వేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు కోరారు. పోలీసులు కూడా ముద్రగడతో చర్చలు జరిపారు. రెండు నెలల వరకు పరీక్షలు జరుగనున్న దృష్ట్యా దీక్షను విరమించుకోవాలని కోరారు. ఆయా వర్గాలతో జరిగిన చర్చల అనంతరం దీక్షను వాయిదా వేస్తున్నట్టు ముద్రగడ ప్రకటించారు.