ఆంధ్రప్రదేశ్‌

పోలీసులు ఇంట్లోకొస్తే పురుగుమందు తాగుతా: ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం కిర్లంపూడిలోని తన ఇంట్లో సతీసమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశిస్తే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. చేతిలో పురుగుమందు డబ్బా చూపుతూ, కాపుల కోసం ఆత్మత్యాగానికి తాను సిద్ధమేనని అన్నారు. ఇంటి తలుపులు వేసుకుని గదిలో ఆయన ఆమరణ దీక్ష ప్రారంభించారు. కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఆందోళనకారులను రౌడీషీటర్లుగా, నేరచరితులుగా చిత్రీకరించి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. కిర్లంపూడికి తన అభిమానులు ఎవరూ రావద్దని, ఎవరి ఇళ్ల వద్ద వారు ఆందోళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసులు ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించేవరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదన్నారు. అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడిచిపెట్టాలన్నారు.