రాష్ట్రీయం

నిరశన దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష భగ్నమైంది. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాల జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల ఆమరణ దీక్ష శనివారంతో ఐదోరోజుకు చేరింది. విద్యార్థులకు షుగర్ లెవెల్ తగ్గిపోయిందని, ఆరోగ్యం క్షీణించిందని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం విద్యార్థిని వైఖరి స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం హెల్త్ వర్శిటీకి తరలిస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్శిటీలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం మరో ఆరుగురు విద్యార్థులనూ పోలీసులు హెల్త్ వర్శిటీకి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని డాక్టర్ రవీందర్ తెలిపారు.
నాది ఎస్సీ ‘మాల’ కులం..
వర్శిటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆమరణ దీక్ష శిబిరాన్ని శనివారం విద్యార్థి రోహిత్ తల్లి రాధిక సందర్శించారు. దీక్షా శిబిరంలో కూర్చొని విసిపై చర్య తీసుకునేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కొడుకు రోహిత్ కులంపై స్పందిస్తూ నాది ‘మాల’ కులం. ఐదేళ్ల వయసులోనే వడ్డెరలకు దత్తత ఇచ్చారు. వడ్డెర కులస్థుడితోనే వివాహం జరగిందని స్పష్టం చేశారు. నాకు ముగ్గురు పిల్లలు. నా భర్తతో విడాకులు తీసుకున్న తరువాత ఎస్సీ కులంలోనే కొనసాగుతున్నానని, ఎవరితోనైనా విచారణ జరిపించుకోవచ్చని ఆమె వివరించారు. నా కొడుకు మృతికి కారణమేమిటో విసి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అయినా న్యాయం కోసం పోరాడుతుంటే కులం ప్రస్తావన తెస్తున్నారెందుకని ఆమె ప్రశ్నించారు.