రాష్ట్రీయం

నవశకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ప్రజలు కోరుకునే వౌలిక సదుపాయాలు కల్పించే విధంగా టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించినట్టు కెటిఆర్ తెలిపారు. ఇంతకాలం మేయర్ పదవిని ఆధిష్టించిన వివిధ పార్టీలు చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా నవశకానికి నాంది పలికే విధంగా మ్యానిఫెస్టో ఉందని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు, ఆశయాలకు అనుగుణంగా మ్యానిఫెస్టో రూపకల్పన జరిగినట్టు డి శ్రీనివాస్ తెలిపారు.
టిఆర్‌ఎస్‌లోకి వలసలు
టిఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌తో పాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ కార్పొరేటల్ ప్రకాశ్‌గౌడ్ టిఆర్‌ఎస్‌లో చేరారు.
30న కెసిఆర్ బహిరంగ సభ
ఈ నెల 30న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి బహిరంగ సభల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువ సభలు నిర్వహించడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌కు గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా దాటదని కెటిఆర్ తెలిపారు. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు రోడ్‌షోను ప్రారంభించారు. ఆంధ్రా తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉన్నారని అన్నారు. హైదరాబాద్‌లో రెప్పపాటు కాలం కూడా విద్యుత్ కోత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు.