రాష్ట్రీయం

నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 23: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరుగనున్న జాతీయ మహిళా సదస్సును ఆమె ప్రారంభించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అమలవుతున్న సంక్షేమ పథకాలు, జిఓలపై సదస్సుకు వచ్చిన అన్ని రాష్ట్రాల మహిళా ప్రతినిధులతో పంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2లక్షల 50వేల నుండి 6లక్షల వరకు ఐటి మినహాయింపు ఇవ్వాలని తాను పార్లమెంటులో పోరాడుతానన్నారు. సర్కార్ ఉద్యోగులతో సమానంగా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరిని కూడా రెగ్యులరైజ్ చేసిన ఘనత తెలంగాణ సర్కాదేనన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో పోరాడుతామని తెలిపారు. 4,200 ఉన్న అంగన్‌వాడీ జీతాలను 7వేలకు పెంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ పెద్ద ఉద్యమాల తరువాత, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు లాంటి కమిటీల తరువాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వంలో అందరు భాగస్వాములై ఒక టీంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.