రాష్ట్రీయం

నైతిక విలువలతో విద్యావ్యవస్థ పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పిలునిచ్చారు. సత్యసాయి విద్యా సంస్థల అయిదో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నిమిష్ పాండ్య సత్యసాయి సేవా సంస్థలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.
దేవుణ్ని విశ్వసిస్తే భయం దరిచేరదు
సింహాచలం: భగవంతుడిని విశ్వసిస్తే భయం దరిచేరదని నరసింహన్ అన్నారు. ఆదివారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. రథంపై పూజలందుకుంటున్న శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడారు. నరసింహస్వామి ఉన్నచోట భయానికి తావులేదని భక్తితో భగవంతుడిని సేవించి తరించాలని ఆయన అన్నారు.