బిజినెస్

నెగటివ్ జోన్‌లోనే టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం జనవరిలోనూ మైనస్‌లోనే నమోదైంది. వరుసగా 15 నెలల నుంచి టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మైనస్‌లో నమోదవుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో గత నెల కూడా మైనస్‌కే పరిమితమైంది. -0.9 శాతంగా నమోదైంది. 2014 నవంబర్ నుంచి డబ్ల్యుపిఐ సూచీ మైనస్‌లో నమోదవుతూ క్రమేణా తగ్గుతుండగా, గత నాలుగు నెలల నుంచే మైనస్‌లో కాస్త పెరుగుతూ వస్తోంది. గత ఏడాది జనవరిలో ఇది మైనస్ 0.95 శాతంగా ఉంటే, డిసెంబర్‌లో మైనస్ 0.73 శాతంగా ఉంది. కాగా, ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెల జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. డిసెంబర్‌లో ఇది 8.17 శాతంగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం మైనస్‌లోనే ఉండటంపట్ల పారిశ్రామిక, వాణిజ్య సంఘం ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం.. రాబోయే నూతన వార్షిక బడ్జెట్‌లో ఖర్చులు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
వడ్డీరేట్లను తగ్గించాలి
ద్రవ్యోల్బణం ఇంకా నెగటివ్ జోన్‌లోనే ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించాలని దేశీయ పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తోంది. రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ తప్పకుండా రెపో రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు. కేంద్ర బడ్జెట్ సంస్కరణలతో మిళితమై ఉండాలని, దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించే నిర్ణయాలతో రావాలని ఫిక్కీ ప్రధాన కార్యదర్శి ఎ దిదార్ సింగ్ ఆకాంక్షించారు.