విజయనగరం

నిఘా కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 19: మరింత పటిష్టంగా నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రజల సహకాఠంతో తొలిదశలో విజయనగరం పట్టణంలో 16 సిసి కెమెరాలను ఏర్పాటుచేసామని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవెల్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయ నూతన సమావేశమందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో గంటస్తంభం నుండి కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకు ఏర్పాటు చేసిన 16 సిసి కెమెరా నిఘా వ్యవస్థను ఆయన డిపి ఓ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణం రోజురోజుకు విస్తరించ బడుతున్నదని నేపథ్యంలో పకడ్బందీగా మానిటరింగ్ చేసేందుకు ఇటువంటి వ్యవస్థ అవసరం గుర్తించి ప్రజల సహకారంతో తొలి విడతలో గంటస్తంభం నుండి కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకు 4.5 లక్షల వ్యయంతో సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. బంగారు వర్తకుల సంఘం అందజేసిన సహకారంతో వీటిని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవి ఏవిధంగా పనిచేస్తున్నదీ స్వయంగా పరిశీలించామని తెలిపారు. అత్యంత అధునిక టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయని అన్నారు. రికార్డింగ్ , లైవ్ 72 గంటల బ్యాటరీ బ్యాక్ అప్, సోలార్ వ్యవస్థకు అనుసంధానం శాటిలైట్ సేవలు క్లోజ్ మానిటరింగ్ ఇందులో ఉన్నాయని అన్నారు. గతంలో కంటే వాహనాల సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరింతగా వాహనాలు పెరుగుతాయని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఆందోళనలు, ధర్నాలు, ముఖ్య కూడలిలో తిరుగాడే వ్యక్తులు , షాపుల్లో , మార్కెట్‌లో జేబు దొంగలు, చైన్ స్నాచర్లు అసాంఘిక శక్తులు కదలికలు వంటివి సిసి ఎస్ టీం వాచ్ చేస్తుందని, అలాగే ఇక్కడ నుండి కూడా నిఘాను పరిశీలించడానికి వీలు ఉందని అన్నారు. త్వరలో విజయనగరంలో మరో 40 కెమెరాలు అందుబాటులోకి వస్తాయని , పార్వతీపురం, సాలూరు, కొత్తవలస తదితర ముఖ్య పట్టణాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎ ఎస్పీ రమణ, డి ఎస్పీలు రాజేశ్వరరావు, ఎవి రమణ, చక్రవర్తి, పట్టణ సి ఐ అప్పారావు బంగారు వర్తకుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ
బలోపేతమే లక్ష్యం
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 19: గతంలో ఏకేంద్ర ప్రభుత్వం చేయని విధంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందిస్తున్న దని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. శుక్రవారం మెసానిక్ టెంపుల్లో బిజెపి జిల్లా అధ్యక్షునిగా పెద్దింటి జగన్మోహనరావు బాధ్యతలు బిశివప్రసాదరెడ్డినుండి స్వీకరించారు. ఈసందర్భంగా నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎపికి ఈ18 నెలల్లో పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు , ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు. కొత్తవలసలో గిరిజన విశ్వవిద్యాలయం రానుందని చెప్పారు. కేంద్రమంత్రులు రాష్టప్రర్యటనకు వచ్చినపుడల్లా ఏదో ఓక ప్రాజెక్టును రాష్ట్రానికి ప్రకటించారని గుర్తుచేసారు. ఇటీవల భాగస్వామ్య సదస్సులో అనేక వేల కోట్ల రూపాయల పరిశ్రమలకు మేకిన్ ఇండియా ఎపిలో భాగంగా ఒప్పందాలు జరిగాయని అన్నారు. పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాకుండా, చిన్న వ్యాపారులకోసం ముద్ర బ్యాంకును ఏర్పాటుచేసి ఎటువంటి హామీ లేకుండా వ్యాపారాభివృద్ధికి సహకారం అందించిన ఘనత నరేంద్రమోదీకే దక్కిందని చెప్పారు. తోటపల్లి , వంశధార , జంఝావతి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈజిల్లాలను సస్యశ్యామలం చేయడానికి అన్నివిధాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ముద్రబ్యాంకు రుణాలు ఇవ్వని బ్యాంకు అధికారుల వివరాలు అందిస్తే జిల్లా పార్టీ నాయకులు వాటి విషయంలో చర్యలు తీసుకుంటారని పలువురు కార్యకర్తలు చేసిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. మున్సిపాల్టీలకు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి లక్షకుపైగా ఇళ్ల మంజూరు చేసారని అన్నారు. పేదలకు సంక్షేమ , అభివృద్ధి పథకాలు అందిస్తున్నవి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు. కొత్తగా పార్టీలోకి ఎవరువచ్చినా సర్ధుకుపోవాలన్నారు. అందరి భాగస్వామ్యంతో పార్టీని జిల్లాలో నడిపించాలని జగన్మోహనరావుకు సూచించారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పెద్దింటి జగన్మోనరావు మాట్లాడుతూ నిబద్ధతగల కార్యకర్తలు పార్టీకి ఉన్నారని , పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని అన్నారు. కాగా శివారెడ్డి మాట్లాడుతూ గత మూడేళ్లుగా తనకు అన్ని విధాల సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్, పివివిగోపాలరాజు, పాకలపాటిమురళి, నిమ్మకజయరాజు, వినారాయణరావు, ముద్దాడమధు,అశోక్, ఇందుకూరి రఘురాజు మహిళానాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన పెద్దింటిని పలువురు నాయకులు అభినందించారు.

ప్రజల చెంతకు కేంద్ర ప్రభుత్వ పథకాలు
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 19: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతంగా అమలు చేసి ప్రజలకు వౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారులు చురుగ్గా పనిచేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం డి ఆర్ డి ఏ సమావేశమందిరంలో గ్రామీణాభివృద్ధి పథకాలపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమీక్షలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, విశాఖ ఎంపి హరిబాబులు మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలకు గ్రామాల్లో వౌలిక సదుపాయాలు పెరగాలని స్పష్టం చేసారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. గుంకలాం నుండి రామవరం రహదారిని ప్రధానమంత్రి గ్రామసడ్‌క్ యోజన కింద చేపట్టడంలో మధ్యలో రియల్ ఎస్టేట్ ఉందని , దీనిని ఆపాలని జడ్పీ తీర్మాణం చేశారని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రియల్ ఎస్టేట్ వారిని అడిగి చేస్తారా ప్రజలముఖ్యమా జడ్పీ తీర్మాణం ఉన్నా ప్రజలకు రహదారి ముఖ్యం అంటూ స్పష్టం చేసారు. తోటపల్లి ప్రాజెక్టుకింద పిల్లకాలువలను సకాలంలో పూర్తిచేయాలని విశాఖ ఎంపి హరిబాబు చెప్పారు. త్వరలోనే వాటిని పూర్తిచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. శాఖల వారీగా చేపడుతున్న వాటిని ఆయా అధికారులు వివరించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పూర్తిగా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తర్చిదిద్దిలా సర్పంచ్‌లకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని, ఉపాధిహామీ పథకం కింద సగటు వేతనం పెరగాలని మంత్రి ఆదేశించారు. గృహనిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేయాలని అన్నారు. డి ఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నప్పటికి బోధనలో నాణ్యత పెరగాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవలు మెరుగుపడాలని చెప్పారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, జగదీష్, గాదెశ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, కె ఎనాయుడు, మీసాలగీత, కోళ్లలిలితకుమారి, జెసి శ్రీకేష్‌బాలాజి లఠ్కర్, డి ఆర్ డి ఎ పిడి ఢిల్లీరావు,తదితరఅధికారలు,సభ్యులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఐదుగురు క్రీడాకారుల ఎంపిక
నెల్లిమర్ల, ఫిబ్రవరి 19: జూనియర్ సబ్ జూనియర్ జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఐదుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ చల్లా రాము తెలిపారు. ఈ పోటీలకు కొండవెలగాడకు చెందిన చిన్నంనాయుడు (56 కేజీల విభాగం) స్వప్న (58 కేజీల విభాగం) కొండగుంపాం గ్రామానికి చెందిన అనురాధ (48కేజీల విభాగం) అంబటి వలసకు చెందిన సుధీర్ (62 కేజీల విభాగం) గంట్యాడకు చెందిన కృష్ణ (69కేజీల విభాగానికి ఎంపికయ్యారు. వీరు గతేడాది నవంబర్ 28, 29 తేదీల్లో ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22 నుంచి 29 వ తేదీ వరకు బీహార్‌లోని పాట్నాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారు. టీమ్ మేనేజర్‌గా చల్లా రాము వ్యవహరించనున్నారు.
జీవనోపాధి కోసం వ్యక్తిగత రుణాలు
* స్ర్తినిధి ఎజిఎం సత్యనారాయణ
బొండపల్లి, ఫిబ్రవరి 19: జిల్లాలో ప్రస్తుత ఏడాదిలో స్థానిక మహిళల జీవనోపాధికోసం వ్యక్తిగత రుణాలు అందజేస్తామని స్ర్తినిధి ఎజిఎం సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం స్థానిక మండల భవన సముదాయంలో గల కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. పొదుపు మహిళా సంఘాల్లోని ఒక్కో మహిళలకు లక్ష రూపాయల వంతున వ్యాపార అభివృద్ధి కోసం అందజేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తొమ్మిది మంది సభ్యుల గల సంఘానికి ఒక్కరికి, 10 మంది సభ్యులు గల సంఘానికి ఇద్దరికి, 13 మంది సభ్యులుగల సంఘానికి ముగ్గురికి, 13 దాటిన సంఘాలకు నలుగురు వంతున వ్యక్తిగత రుణాలు అందజేస్తామని తెలిపారు. ఐదేళ్ల కాల పరిమితి గల ఈ రుణాలు తీర్చాలని చెప్పారు. చెల్లింపులో నాలుగు శాతం వడీ కూడా చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ రాగానే వారి ఖాతాలో జమచేస్తామని తెలిపారు. జిల్లాలో 40 కోట్లు స్ర్తి నిధి రుణాలు అందజేయడం లక్ష్యం కాగా ఇంతవరకు రూ.22 కోట్ల రుణాలు అందజేసామని చెప్పారు. జిల్లాలో 93 శాతం స్ర్తి నిధి రుణాల రికవరీ ఉందని తెలిపారు. కార్యక్రమంలో వెలుగు ఎపి ఎం కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు కార్మికుల ధర్నా
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 19: ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలేదని ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోటి ప్రకాష్ అన్నారు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇక్కడ జిల్లా ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్థేశించిన మేరకు కనీస వేతనాలు అందడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని చెప్పారు. వీరికి కనీస వేతనాలను చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుతూ
1న విశాఖలో ధర్నా
* ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక వెల్లడి
విజయనగరం (కంటోనె్మంట్), ఫిబ్రవరి 19: ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి ని కాంక్షిస్తూ మార్చి ఒకటో తేదిన విశాఖపట్నంలో చేపట్టే ధర్నాలో కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో గల యుటిఎఫ్ కార్యాలయంలో శుక్రవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస మాట్లాడుతూవిజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో సదస్సులు, సమావేశాలు నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో ప్రముఖలు, మేథావులు, విద్యావేత్తలతో చర్చించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి పలు సూచనలు, సలహాలను సేకరించిన తర్వాత వాటిపై ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు మూతపడ్డంతో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, నీటివనరుల్లేక వ్యవసాయం అభివృద్ధికాకపోవడంతో ఉపాధిని వెతుక్కుంటూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు వలసపోతున్నారని అన్నారు. ప్రస్తుత పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా గ్రామీణ ప్రజలు పేదరికం, అనారోగ్యం పాలవుతున్నారని, వీటిని అధిగమించాలంటే మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని, రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినట్లు ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ, రైల్వేజోన్, విద్యాసంస్థల ఏర్పాటు, పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు రూ.15వేల కోట్ల కేటాయింపు, నీటిప్రాజెక్ట్‌ల నిర్మాణం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కోపరేటివ్ షుగర్ పరిశ్రమల పరిరక్షణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపన, కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు, అటవీ సంపదను వినియోగించుకుని గిరిజన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ విద్య, వైద్య రంగాలు బలోపేతం చేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి యు.ఎస్ రవికుమార్, అరసాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ‘ ఉమెన్స్ హాస్టల్ డే’ వేడుకలు
విజయనగరం (పూల్‌బాగ్), ఫిబ్రవరి 19: పట్టణంలోని పూల్‌బాగ్‌లో ఉన్న మహారాజా పిజి కళాశాలలో శుక్రవారం ఉమెన్స్ హాస్టల్‌డే’(మహిళా వసతిగృహం దినోత్సవం)వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాన్సాస్ కరస్పాండెంట్ ఏ.రాఘవరావు మాట్లాడుతూ ఎం ఆర్ పిజి, ఎం ఆర్ ఫార్మశీ కలసి సంయుక్తంగా వేడుకలను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల విద్యార్ధుల్లో ఉత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు. కళాశాల సంచాలకులు ప్రొఫెసర్ సాగి సన్యాసిరాజు మాట్లాడుతు ఉమెన్స్ హాస్టల్‌డే సందర్భంగా కళాశాలలో విద్యార్ధినులకు పలుపోటీలను నిర్వహించామని అన్నారు. రంగోళి, వంటలపోటీ, క్రీడాపోటీలు జరిపామని చెప్పారు. ఇటువంటి పోటీలను ఏర్పాటుచేయడం వల్ల విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి వస్తుందని అన్నారు. ఈసందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థ్ధులకు బహుమతులను అందచేసారు.అనంతరం విద్యార్థినులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. కార్యక్రమంలో డి ఆర్‌కెరాజు, పి ఎన్ రాజు, సీతాకుమారి, రజనీవర్మ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలపై ప్రాంతీయ సదస్సులు

విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 19: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నియోజక వర్గాల వారీగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ జగదీష్ అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమాశేశంలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలు చేస్తున్నా వాటిని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నామని పార్టీ నాయకులనుండి వ్వక్తం అయిన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నారు. నెలవారీ పార్టీ సమావేశాల నిర్వహణ, పార్టీ నాయకులు పాల్గొనడంపై చర్చ జరిగింది. 22న పార్టీ అనుబంధ కమిటీల సభ్యత్వాలను చేర్పించాలని, చంద్రన్న బాట ద్వారా ఉపాధిహామీ నిధులతో ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఎమ్మెల్యేలుప్రజల్లో కి తీసుకెళ్లాని , తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీ ఆర్ జలసిరి,తోటపల్లి ప్రాజెక్టుప్రారంభ వంటి కార్యక్రమాల ద్వారా పార్టీకి మంచి పేరు వచ్చిందని అభిప్రాయం వ్యక్తం అయింది. మున్సిపాల్టీల్లో తాగునీటి సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేందుకు నిర్ణయించారు. ఈసమావేశంలో పలు జిల్లా రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.
ఈసమావేశంలోజడ్పీ చైర్మన్ స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కోళ్లలలితకుమారి, మీసాలగీత,కె ఎనాయుడు, ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, గాదెశ్రీనివాసులనాయుడు, శోభాహైమావతి, తెంటులక్ష్మునాయుడు, భంజ్‌దేవ్, తూముల భాస్కరరావు,వెంకటనాయుడు ఐవిపిరాజు,మున్సిపల్ చైర్మన్ రామకృష్ట తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో కోటి మొక్కల పంపిణీ లక్ష్యం

బొండపల్లి , ఫిబ్రవరి 19: ప్రస్తుత ఏడాదిలో జిల్లాలో కోటి మొక్కల పంపిణీ చేయడానికి లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా సామాజిక శాఖ అటవీ శాఖ అధికారి వేణుగోపాలరావు చెప్పారు. శుక్రవారం బొండపల్లి జంక్షన్ వద్ద గల నర్సరీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది జులై నెలలో కోటి మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జిల్లాలోని 71 సామాజిక వన నర్సరీలలో 80 లక్షల మొక్కలు పేరిటోరియల్ ఫారెస్టులలో 20 లక్షల మొక్కలు పెంచుతున్నామని చెప్పారు. పెద్దకనుగా, వేప, నేరేడు, సురాయి తదితరవి నీడనిచ్చే మొక్కలు 12 లక్షలు, ఉసిరి, గుమ్మడి, టేకు తదితరవి 30 లక్షలు, మూడు లక్షల చిన్నమొక్కలు రైతులు ప్రభుత్వ కార్యాలయాలకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్ట్టామని చెప్పారు. 36 పాఠశాలల వద్ద నర్సరీలు ఏర్పాటు చేసామని ఐదు కేంద్రాలకు ఒక వనసేవకున్ని నియమించామని వెల్లడించారు. జిల్లాలో 908 పాఠశాలల్లో ఫారెస్టు ద్వారా మరుగుదొడ్లు పరిశుభ్రత కోసం శానిటేషన్ సేవకున్ని నియమించామని చెప్పారు. జిల్లాలో ప్రహారిలేని పాఠశాలకు మొక్కలతో కాంపౌండ్ వాల్ వేస్తామని చెప్పారు. జూన్ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బొండపల్లి ఫారెస్టు సెక్షన్ అధికారి అప్పలరాజు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.