శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్థానిక సంస్థల సెస్సు బకాయిలు రూ.17 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 17: స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్సు బకాయిలు రూ.17.75 కోట్ల వరకు పేరుకుపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు వెల్లడించారు. గతంలో ఎవరూ ఈ వసూళ్లపై దృష్టి సారించకున్నా తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక విడతలవారీగా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి వసూళ్లు చేసేలా కార్యాచరణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు లైబ్రేరియన్ శ్రీనివాసరాజు నేతృత్వంలో చేపట్టిన గ్రంథాలయ వారోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసే ఆస్తిపన్నులో 8శాతం వరకు సెస్సు రూపేణా గ్రంథాలయాలకు బట్వాడా చేయాలన్నారు. అయితే కోట్లాది రూపాయల వరకు బకాయి పేరుకుంటున్నా స్థానిక సంస్థల పాలకవర్గాలు, అధికారుల నిర్లక్ష్యధోరణితో పట్టించుకోలేదన్నారు. తాను పదే పదే కోరుతున్న వైనంతో సెస్సు బకాయిలు సానుకూలంగా వసూలవుతున్నాయన్నారు. గ్రంథాలయాల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నెల్లూరులోని కేంద్ర గ్రంథాలయంలోనే 60 వేలకుపైగా పుస్తకాలు లభ్యమవుతున్నట్లు తెలిపారు. అందరూ ఈ పుస్తక సంపదను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వల్ప రుసుముతో లభించే గ్రంథాలయ సభ్యత్వాలను స్వీకరించాలని ఆకాంక్షించారు. లైబ్రరీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ఇన్‌చార్జిలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 105 మందికిగాను ప్రస్తుతం 60 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంతోనైనా సిబ్బంది భర్తీ చేసేలా ఆదేశాల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు లైబ్రరీకి సొంత భవన ఏర్పాటుకు తప్పక కృషి చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ ప్రతినిధి మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు చావిడి కూడలి వద్ద ఉన్న పాత బందెలదొడ్డి స్థలాన్ని గ్రంథాలయ నిర్మాణానికి కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా రాజకీయాలు అడ్డుపడుతున్నాయని సభాముఖంగా వాపోయారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయానికి స్థలం కాదని ఏకంగా తమ తరపున సదుపాయం కలిగిన భవనమే కేటాయిస్తామని తెలిపారు. పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయం అంతా ప్రస్తుతం మున్సిపాలిటీలోకి చేరిందన్నారు. అక్కడ లైబ్రరీ ఏర్పాటుకు తప్పక చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై మాజీ మార్కెట్ చైర్మన్ ఇందూరు రమణారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన మాజీమంత్రి ఆనంకు ఈ లైబ్రరీ భవన నిర్మాణం చేయకపోవడం కొంతలోటుగా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇంకా మున్సిపల్ వైస్‌చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ షేక్ సందానీ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్, లైబ్రరీయన్లు శ్రీనివాసరాజు, నారాయణరావు, తెలుగుభారతి సేవా సమితి యానాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ రాగి వనమ్మకు వైకాపా కౌన్సిలర్లు అల్లారెడ్డి ఆనంద్, నందవరం మిరియం, కొండా స్వరూపారాణి, దొరసానమ్మ, తదితరులు స్థానిక 11వ వార్డు పరిధిలోని పాత బందెల దొడ్డి ప్రదేశంలో గ్రంధాలయ నిర్మాణానికి సహకరించాలంటూ వినతిపత్రాన్ని అందచేశారు.