క్రైమ్/లీగల్

బొడ్డుపల్లి శ్రీను హత్య కేసు నిందితులకు బెయిల్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, మార్చి 21: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఐదుగురు నిందితుల బెయిల్‌ను రద్దు చేస్తూ జిల్లా అదనపు కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంతో విచారణకు ఇబ్బంది కలగవచ్చని నల్లగొండ టూటౌన్ పోలీసులు కోర్టును ఆశ్రయించి బెయిల్ రద్దుకు అభ్యర్థించారు. పోలీసుల పిటిషన్‌కు స్పందించిన కోర్టు నిందితుల బెయిల్‌ను రద్దు చేస్తూ వారం రోజుల్లోగా వారు లొంగిపోవాలంటూ ఆదేశాలిచ్చింది. నిందితుల్లో ఏ-6 నుండి ఏ-10వరకు ఉన్న దామనూరి సతీష్, మాండ్ర మహేష్, మిట్టపల్లి సాయి, మెరుగు గోపి, మాతంగి మోహన్‌లను లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశించింది.