మహబూబ్‌నగర్

పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తుందని, ఇక్కడ పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను పరిశీలించారు. గద్వాల మండలంలోని బీరెల్లి, తెలుగోనిపల్లి పుష్కరఘాట్లను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు పలు సూచనలు, సలహాలు అందించారు. పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ఘాట్‌కు దూరంగా వాహనాలు నిలిపే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా సిసి కెమెరాలతో పాటు ప్రత్యేక సాధనాల ద్వారా పర్యవేక్షణలు చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఆర్డీఓ అబ్దుల్ హమీద్, డిఎస్పీ బాలకోటి, సిఐ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధరూరు మండలంలో...
ధరూరు: పుష్కరాల సమయం దగ్గర పడుతుండడంతో గురువారం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పుష్కరపనులను పరిశీలించారు. మండల పరిధిలోని పెద్ద చింతరేవుల, నెట్టెంపాడు, ఉప్పేరు గ్రామాలలో నదితీరాన చేపట్టిన పుష్కర పనులను పరిశీలించడం జరిగింది. పుష్కర పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. విఐపి ఘాట్ల వద్ద ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఘాట్ల వద్ద పోలీసు నిఘా పెంచాలన్నారు. ఈమె వెంట గద్వాల ఆర్డీఓ అబ్దుల్ హమీద్, డిఎస్పీ బాలకోటి, సిఐ సురేష్, ధరూరు ఎస్‌ఐ అమ్జద్‌అలి, ఎఇలు, జెఇలు పాల్గొన్నారు.