నమ్మండి! ఇది నిజం!!

స్మృత్యంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రితం వారం మరణించిన జీవిత భాగస్వాముల ప్రేమ, అనురాగాలతో చేసిన నివాళి గురించి చదివాం. ఇలాగే ఈ వారం మరణించిన వారి ఆత్మీయులు చేసిన నివాళి గురించి చదువుదాం.
9.9.1981లో యుటిఏ సంస్థ విమానం 772 ఆఫ్రికాలో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బ్రాజోవిల్ నించి ఫ్రాన్స్‌లోని పేరిస్‌కి బయలుదేరింది. దారిలో అది నైగర్‌లోని టెనరే రీజియన్ ఎడారిలో కూలిపోయి 155 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది మరణించారు. ఆరుగురు లిబియా ఉగ్రవాదులు సూట్‌కేస్ బాంబ్‌తో దీన్ని పేల్చేశారు. మరణించిన ఆ ప్రయాణీకుల ఆత్మీయులు 18 సంవత్సరాల తర్వాత 2007లో అది కూలిపోయిన చోట ఓ జ్ఞాపక చిహ్నాన్ని నిర్మించారు. విమానం ఆకారం వచ్చేలా ఇసుకలో చుట్టూ నల్లటి రాళ్లని పేర్చారు. ఈ రాళ్లని 70 కిలోమీటర్ల దూరం నించి లారీల్లో ఇక్కడికి తెచ్చారు. రెండు నెలల్లో ఈ జ్ఞాపక చిహ్నం నిర్మాణం పూర్తి చేశారు. మరణించిన 170 మందికి గుర్తుగా 170 విరిగిన అద్దాలని చుట్టూ అమర్చిన రాళ్ల మీద పొదిగారు. పది మైళ్ల దూరంలో రాలిపడి, ఇసుకలో కూరుకుపోయిన విమానం రెక్కని తవ్వి తీసి లారీలో ఇక్కడికి తెచ్చి స్థూపంలా అమర్చారు. నల్లటి రెండు గ్రానైట్ రాళ్ల మీద మరణించిన వారి పేర్లు, వయసు, దేశం వివరాలని చెక్కి ఇక్కడ ఉంచారు.
లిబియన్ ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన 17 కోట్ల డాలర్ల పేకేజ్‌లోంచి ఈ జ్ఞాపక చిహ్నంకి కొంత ఖర్చు చేశారు. అమర్చిన ఈ నల్ల రాళ్ల మధ్య విమానంలా కనపడేలా ఇసుకని వదిలేశారు. సరిగ్గా అది కూలిన చోటే దీన్ని నిర్మించారు. ఈ జ్ఞాపక చిహ్నాన్ని గూగుల్ ఎర్త్, గూగుల్ మేప్‌లో చూడచ్చు. ఎడారి ఎండకి వెరవక ఈ జ్ఞాపక చిహ్నాన్ని ఆత్మీయులు తరచు వెళ్లి సందర్శిస్తున్నారు.
మరో ఆత్మీయ ఉదంతం ఇది. అమెరికాలోని మెయిన్ రాష్ట్రంలో, న్యూ ఇంగ్లండ్‌లోని యార్‌వౌత్ నివాసి ఫ్రేంక్ నైట్ తన 103వ ఏట మరణించాడు. యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌లో 1930లో ఫారెస్ట్రీ సబ్జెక్ట్‌లో డిగ్రీ సంపాదించి, అనేక కాగితాల కంపెనీల్లో పని చేశాక కాగితం పరిశ్రమకి కలపని సరఫరా చేసే స్వంత వ్యాపారాన్ని ఆరంభించాడు. అమెరికాలోని అతి పురాతన ఎల్మ్ చెట్టు వయసు 217 సంవత్సరాలు. జీవించి ఉన్నంతకాలం హెర్బీ అనే పేరుగల ఈ చెట్టుని ఫ్రేంక్ సాకుతూనే ఉన్నాడు. పధ్నాలుగు రకాల ఫంగస్ వ్యాధుల నించి ఫ్రేంక్ ఈ చెట్టుని రక్షించాడు. దీని పొడుగు 110 అడుగులు. ఈ చెట్టు 1793లో పుట్టిందని, దాని బెరడుకి ఉన్న వలయాల్ని బట్టి శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. అంటే జార్జ్ వాషింగ్టన్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు ఐనప్పుడు, అడవుల్లోని కలపని అమ్మే వ్యాపారం చేసే ఫ్రేంక్ యార్‌వౌత్ వీధుల్లోని వృక్షాలని ఏభై రెండేళ్లపాటు సంరక్షించాడు. అతను కొట్టిన చెట్ల కన్నా పోషించి, రక్షించిన చెట్లే అధికం అని మిత్రులు చెప్తారు.
ఫ్రేంక్ మరణించాక ఆత్మీయులు ఆ అతి వృద్ధ ఎల్మ్ చెట్టు కొమ్మని కొట్టి, ఆ కలపతో శవపేటికని తయారుచేసి, అందులో ఆయన శవాన్ని ఉంచి ఖననం చేశారు.
మూడో ఉదంతం బ్రిటన్‌లో జరిగింది. అక్కడి షెపర్డ్ షైర్‌కి చెందిన గేరీ పేటిసన్ (42) మోటర్ బైక్‌ని నేర్పే వృత్తిలో ఉన్నాడు. ఇతను మోటర్‌బైక్ మీంచి పడి, ఆ ప్రమాదంలో ఐన గాయాలతో ఐదు రోజుల తర్వాత మరణించాడు. తను మరణిస్తే ఎవరూ కంట తడి పెట్టకూడదని, అందుకు వీలుగా శ్మశానానికి తన ఖననాన్ని చూడటానికి వచ్చే సందర్శకులంతా ఫేన్సీ డ్రస్‌లలో వచ్చి తనకి వీడ్కోలు చెప్పాలని కోరాడు. ఆ ప్రకారం దానికి హాజరైన రెండు వందల ఏభై మంది వివిధ ఫేన్సీ డ్రెస్‌లలో వచ్చారు. బేట్‌మేన్, ఫ్రైడ్ ఎగ్, బర్గర్, కౌ బాయ్, సూపర్‌మేన్, మాన్‌స్టర్, డెవిల్, ఫ్లింట్ స్టోన్, లయన్ ఇంకా అనేక డిస్నీ కేరెక్టర్స్‌లా కనిపించే దుస్తులని ధరించి రావడంతో అంతా ఒకర్ని చూసి మరొకరు నవ్వుకున్నారు. దాంతో శ్మశానంలో సాధారణంగా కనిపించే విషాదం బదులు ఆ సెరమనీ అంతా నవ్వులతోనే సాగింది.
అమెరికాలో కెంటకీ రాష్ట్రానికి చెందిన ఆరన్ 2012లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కంప్యూటర్‌లో తల్లిదండ్రులకి రాసిన లేఖని వారు చదివారు. రెస్ట్‌రెంట్‌లో పీజా తిన్నప్పుడు తన పేరున వెయిట్రెస్‌లకి ఐదు వందల డాలర్ల టిప్‌ని ఇవ్వమని రాశాడు. అమెరికాలో ఏభై రాష్ట్రాల్లో ఉన్న ఏభై మంది వెయిటర్స్‌కి టిప్ ఇవ్వడం తన ఆఖరి కోరిగా ఆరన్ పేర్కొన్నాడు.
అతని కోరికని తీరుస్తూ ఆరన్ తమ్ముడు సేత్ ఏభై రాష్ట్రాలకి వెళ్లి ఎనభై మంది వెయిట్రెస్‌లకి తలో ఐదు వందల డాలర్ల టిప్‌ని, ఆరన్ రాసిన అంతిమ కోరిక ఉత్తరం ప్రింట్ అవుట్‌ని తన అన్న గౌరవార్థం ఇచ్చాడు. ఆన్‌లైన్‌లో దీని గురించిన వీడియోని ‘ఆరన్స్ లాస్ట్ విష్’ పేరున పోస్ట్ చేశాడు కూడా.
జిమ్ కెల్లీ రోడ్ దాటుతూ ఓ కారు గుద్దుకుని మరణించాడు. అతనికి మూడో ఏట నించే పరిగెత్తడం అంటే ఇష్టం. ఆరోగ్యం కోసం పరిగెత్తమని అందర్నీ ప్రోత్సహించేవాడు. పరుగు పందేల్లో పాల్గొనే వారిని దారి పక్కన నిలబడి ప్రోత్సహించేవాడు. గెలిచిన వారిని ఈమెయిల్ ద్వారా అభినందించేవాడు.
జిమ్ భార్య అంత్యక్రియలకి హాజరయ్యే వారిని అందరినీ రన్నింగ్ షూస్, టైట్స్, షార్ట్స్‌లో రమ్మని అర్థించింది. వారి ఊరికి శ్మశానం మైలు దూరంలో ఉంది. ఆ బుధవారం ఆత్మీయులే కాక, గ్రాండ్ రేపిడ్స్ రన్నింగ్ క్లబ్ సభ్యులు కూడా శవ పేటిక వెనక పరిగెత్తుతూ శ్మశానానికి వెళ్లి జిమ్‌కి వీడ్కోలు చెప్పారు.

పద్మజ