నమ్మండి! ఇది నిజం!!

జ్ఞాపకశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమంతా జ్ఞాపకశక్తిని కోరుకుంటాం. కాని దాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయం. పైగా ఇష్టం లేనిది చేయనప్పుడు మర్చిపోయాం అని అబద్ధం ఆడతాం. విదేశాల్లో జ్ఞాపకశక్తిని మైండ్ స్పోర్ట్ (మెదడాట)గా తీసుకుని ఆడుతున్నారు. వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ గ్లోబల్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకశక్తి మీద పోటీలని నిర్వహిస్తూంటుంది. హాంకాంగ్, లండన్, సింగపూర్, అల్జీర్స్ మొదలైన దేశాల్లో దీన్ని నిర్వహిస్తూంటారు. బెహరిన్, చైనా, గ్రీస్ మొదలైన దేశాల్లో కూడా ఈ పోటీని నిర్వహించారు. ఇరవై దేశాల నించి సగటున మూడు వందల మంది ఈ పోటీలో పాల్గొంటారు. ఇందులో గెలుపొందిన వారు ఆ సంవత్సరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కుతారు.
లండన్‌కి చెందిన డామినిక్ ఓ బ్రియన్ పదేళ్లలో ఎనిమిదిసార్లు వరల్డ్ మెమరీ ఛాంపియన్‌గా ఎన్నికయ్యారు. లండన్‌లో ఇతను జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసుకునే నైపుణ్య పాఠాలని బోధిస్తున్నాడు కూడా. ఇతను పేక బొత్తిలోని 52 కార్డ్‌లని కొద్ది క్షణాలు చూశాక గుర్తుంచుకుని ఆ క్రమాన్ని సరిగ్గా చెప్పగలడు.
ఇప్పుడు ఇతని వయస్సు 59. ఏభై ఏళ్ల క్రితం, అంటే బాల్యంలో ఇతనిలో ఈ అసాధారణ శక్తి లేదు. పైగా ఏ.డి.డి. (ఎటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్) అనే మానసిక వ్యాధి ఉండేది. ఒకే విషయం మీద మనసుని కేంద్రీకరించలేక పోవడం ఆ వ్యాధి లక్షణం. 1960లలో ఈ వ్యాధికి ఇంకా పేరు పెట్టలేదు. డిస్‌లెక్సియా అనే మరో మానసిక వ్యాధి వల్ల వెనక నించి ముందుకి రాసేవాడు. బాల్యంలో ఓ రోజు ఇతనికి బలమైన దెబ్బ కూడా తగిలింది.
‘1976లో ఓ రోజు టీవీలో ఒకతను పేకముక్కలని చూసి గుర్తించే నైపుణ్యాన్ని ప్రదర్శించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అతను దాన్ని ఎలా సాధించగలిగాడా అని ఆలోచించాను. అప్పుడు నా వయసు ముప్పై. ఆ రోజు నించి నాకు నేనే జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే శిక్షణని ఇచ్చుకోసాగాను. మనిషి జ్ఞాపకశక్తికి పరిమితి అనేదే లేదు. దాన్ని ఎంతైనా అభివృద్ధి చేసుకుంటూ వెళ్లచ్చు. ఎవరైనా తగిన సాధనతో జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు’ అతను ఓ విలేకరికి చెప్పాడు.
రెండు వారాల తర్వాత అనూహ్యంగా అతని జ్ఞాపకశక్తి పెరిగింది. మూడు నెలల తర్వాత పేక బొత్తిలోని అన్ని ముక్కలని గుర్తు పెట్టుకోగలిగాడు. సంవత్సరం తిరిగేసరికి గుర్తుంచుకునే వేగంతో కూడా అభివృద్ధి జరిగింది. ఆ ఏడాది జ్ఞాపకశక్తి పోటీలో మొదటి స్థానం పొంది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. 54వ ఏట కల్లా డామినిక్ ఆరు పేక బొత్తుల్లోని కార్డులని గుర్తు పెట్టుకునే సమర్థతని సాధించాడు. ఆరు పేక బొత్తులను గుర్తుంచుకోవడమే జ్ఞాపకశక్తికి పరిమితి అని చాలామంది భావించేవారు. కాని డామినిక్ పట్టుదలగా 54 జతల పేక బొత్తులని గుర్తుంచుకుని వారి అభిప్రాయం తప్పని రుజువు చేశాడు.
డామినిక్ 1994లో హౌ టు డెవలప్ ది పర్‌ఫెక్ట్ మెమరీ? (చక్కటి జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసుకోవడం ఎలా?’ అనే పుస్తకాన్ని రాశాడు. అందులో రాసిన జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించిన టెక్నిక్ 2 వేల ఏళ్ల క్రితమే గ్రీక్స్ ఉపయోగించిన టెక్నిక్ అని అనేక ఉత్తరాలు వచ్చాయి. దాని పేరు జర్నీ టెక్నిక్. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం, ఆఫీస్‌కి వెళ్లి వచ్చే దారిలోనివి గుర్తుంచుకోవడంతో ఈ టెక్నిక్‌ని ఆరంభించాడు. దీనికి ఊహని కూడా జత చేయాలి. ఉదాహరణకి పది వస్తువుల కోసం సూపర్ బజార్‌కి వెళ్లినప్పుడు ఒకే వస్తువుని అది ఉండని ఒకో ప్రదేశంలో ఊహించుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా గుర్తుంచుకోవడం, వెళ్ళే దారిలోని ఓక్ వృక్షం నించి వేలాడే వైన్ బాటిల్, పార్క్ బెంచి మీద కార్న్ ఫ్లేక్స్ డబ్బా... ఇలా.
సూపర్‌బజార్‌కి వెళ్లాక దారిలో మొదటగా కనపడే ఓక్ వృక్షం, పార్క్ బెంచ్ ఇలా గుర్తు చేసుకుంటూంటే ఆ వస్తువులు గుర్తొచ్చాయి. ఇది తేలిక మార్గమే కాక సమర్థవంతమైన జ్ఞాపకశక్తికి మార్గం. షాపింగ్ జాబితా, అపాయింట్‌మెంట్స్, ఫోన్ నెంబర్లు, తారీఖులు, పేర్లు మొదలైనవి గుర్తుంచుకోగలడు. కాబట్టి నిత్య జీవితంలో అతను కాగితం, కలం వాడాల్సిన అవసరం లేదు. ఇతను జ్ఞాపక శక్తి మీద అనేక పుస్తకాలని రాయడమే కాక ఆ అంశం మీద లెక్చర్స్ కూడా ఇస్తూంటాడు.
1991లో డామినిక్ కేసినోలలో నంబర్లని గుర్తుంచుకుని జూదంతో సంపాదించసాగాడు. త్వరలోనే యుకె, లాస్‌వెగాస్, ఇతర దేశాల్లోని ప్రసిద్ధ జూద గృహాలు ఇతని ప్రవేశాన్ని నిషేధించాయి.
వరల్డ్ మెమరీ ఛాంపియన్ అవడానికి అంకెలని గుర్తుంచుకోవాలి. ఓ గంటలో ఎక్కువ అంకెలని గుర్తుంచుకునేవారు గెలుపొందుతారు. డెసిమెల్స్ తర్వాతి 3,000 అంకెలని, పేక బొత్తులని, 120 పేర్లని, 25 ముఖాలని పదిహేను నిమిషాల్లో గుర్తుంచుకోవాలి. బోర్డు మీద రాసింది చూసి గుర్తుంచుకోవడం తేలిక కాని నోటితో చెప్పిన సంఖ్యని గుర్తుంచుకోవడం కష్టం అని డామినిక్ చెప్తాడు. ఓ క్షణానికి ఒకో అంకె చొప్పున చెప్తారు.
2017లో డిసెంబర్ 14-18 తారీకుల్లో సింగపూర్‌లో రాఫెల్ సిటీలోని ఫెయిర్‌వౌత్ హోటల్‌లో జరిగే 26వ వరల్డ్ మెమరీ ఛాంపియన్‌షిప్‌లో మళ్లీ విజయం తనే వరిస్తుందని డామినిక్ ఆశిస్తున్నాడు. ఇందులో పాత పోటీల్లో పాల్గొన్న వారిలో 200 మంది, కొత్తగా వంద మంది పాల్గొంటారు. గత పోటీల్లో కనీసం 3,000 పాయింట్స్ గెల్చుకున్న వారికే అర్హత. మొదటి మూడు స్థానాలు పొందిన వారికి బహుమతిగా పదివేల పౌండ్ల విలువైన ఇటాలియన్ బ్రాండ్ మాంటిగ్రప్పా పెన్‌ని, సర్ట్ఫికెట్‌ని ఇస్తారు. ఈ పెన్ పేరు ది బ్రెయిన్ పెన్. బంగారం, వెండి, కంచుతో చేసిన అనేక న్యూరాన్స్ కనెక్ట్ అయిన ఈ ఎలక్ట్రానిక్ పెన్‌ని విజేతలకి బహుమతిగా ఇస్తారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ పెన్స్‌లో సమాచారాన్ని స్టోర్ చేసుకోవచ్చు.
ఇంతదాకా ఏ అమెరికన్ ఈ పోటీలో ఏడో స్థానాన్ని మించి చేరుకోలేదు. ఇండియా నించి ఒక్కరు కూడా ఈ పోటీలో పాల్గొనలేదు.

-పద్మజ