నమ్మండి! ఇది నిజం!!

చిత్రమైన కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లోని బర్మింగ్‌హేమ్ ఎం 6 హైవే సమీపంలో ఉన్న ఓ చిన్న ఊళ్లోని సుజాన్ మిల్లర్ అనే ఆమెకి పదేపదే ఓ కల వచ్చి మధ్యలో భయంతో మెలకువ రాసాగింది. ఆ కలలో ఆమెకి ఒక ట్యూడర్ భవంతి కనిపించేది. ఆవరణలో చెర్రీ చెట్లు, పక్షుల కోసం నీళ్ల తొట్లు గల ఆ ఇంటి నంబర్ 12 అని స్పష్టంగా కలలో కనిపించేది. ఆ కలలో ఆమె ఆ ఇంటి తలుపు తెరచుకుని లోపలకి వెళ్తే, ఎర్ర జుట్టుగల ఒకామె, తెల్లజుట్టు గల ఒకాయన పడక గదిలో మంచం మీద మైథునంలో కనిపించేవారు. సుజాన్ మర్యాదగా ‘ఐయాం సారీ’ అని చెప్పగానే మెలకువ వచ్చేస్తూంటుంది.
ఇది తెలిసిన సుజాన్ భర్త పత్రికల్లో కలల మీద రాసిన వ్యాసాలు, పుస్తకాలు తెచ్చిస్తూండేవాడు. క్రమంగా ఆ కల వల్ల ఆమెలో మానసిక వత్తిడి కలిగి, దాని ప్రభావం నిత్య జీవితం మీద పడసాగింది. కొన్న వస్తువునే మళ్లీ కొనడం, ఇంట్లో చేసిన పనినే మళ్లీ చేయడం, చాలా విషయాల్లో అయోమయంగా ఉండటం జరగసాగింది. ఆమె భర్త టామ్ పనిచేసే అలైడ్ ఛెస్టర్ అండ్ నార్త్ ఈస్ట్ బేంక్ అతనికి బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చి లివర్‌పూల్‌కి పంపించింది. ఆ దంపతులు లివర్‌పూల్‌కి వెళ్లి హోటల్‌లో బస చేశారు. నియమాల ప్రకారం నెల రోజుల హోటల్ బస బిల్‌ని బేంక్ చెల్లిస్తుంది. ఈలోగా వాళ్లు కొత్త ఇంటిని వెతుక్కోవాలి.
బేంక్ రీలొకేషన్ ఆఫీసర్ అనేక మంది రెంటల్ ఏజెంట్స్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు ఇచ్చాడు. గతంలో సుజాన్‌కి అప్పుడప్పుడు వచ్చే ఆ కల ఇప్పుడు నిత్యం రాసాగింది.
ఓ రోజు టామ్ ఆఫీస్ నించి వస్తూ అద్దెకి సిద్ధంగా ఉన్న పదిహేను ఇళ్ల ఫొటోలని, ఇతర వివరాలని తెచ్చాడు. సుజాన్ ఆ వివరాలు చదివి సముద్రానికి దగ్గరగా ఉన్న ఇల్లు ఇష్టం కాబట్టి తమకి అందుబాటులో ఉన్న అలాంటి ఆరింటిని ఎంపిక చేసింది. ఆరు ఇళ్ల ఫొటోలని చూస్తూ ఓ ఫొటోని చూసి ఉలిక్కిపడింది. బయటకి అందంగా లేని ఆ ఇంటినే తను కల్లో ఇంతకాలం చూసిందని ఆమెకి అనిపించింది. అది కూడా తన కలలోని ట్యూడర్ ఇల్లే. ఆ ఇంటికి వేసిన లాంటి రంగులే ఈ ఫొటోలోని ఇంటి బయట వేసి ఉన్నాయి. ఆ ఇంటి నంబర్ 12, బోవిన్ బ్రూక్ ఎవెన్యూ. కలలోని ఇంటి నంబర్ కూడా 12.
ఆ ఇంటి తలుపు మీద కొట్టడానికి అమర్చిన ఇత్తడి నాకర్ కూడా ఫొటోలోని ఇంటి తలుపుకి కనిపించింది. అలాంటి ఇళ్లు ఇంగ్లండ్‌లో వేల సంఖ్యలో ఉండచ్చని, అది కాకతాళీయం అని అనుకుంది.
లేదా తను గతంలో లివర్‌పూల్‌కి వచ్చినప్పుడు ఆ ఇంటిని చూడటంతో అది కలలో కనిపించి ఉండచ్చని సుజాన్ భావించింది. ఆమె పధ్నాలుగేళ్ల క్రితం ఆ ఊళ్లో ఓ వారం రోజులు ఉంది. ఆమెకి కలలో కనిపించిన ఇంటికే టామ్ మొదటగా తీసుకెళ్లాడు. దూరం నించి వినిపించే సముద్రపు హోరు ఆమెకి కలలో కూడా వినిపించింది.
బోవిన్ బ్రూక్ అవెన్యూలోని ఆ 12వ నంబర్ ఇంటి ముందు కారాపగానే సుజాన్‌లో భయం కలిగింది. చెర్రీ చెట్లు, పక్షుల నీళ్ల తొట్టెలని చూశాక తను కల్లో చూసిన ఇల్లు అదే అని రూఢీగా తోచింది. ఆమె కారు దిగి వెళ్లి తలుపు తోస్తే తెరచుకుంది. లోపలకి వెళ్లే హాల్లోంచి తలుపు తెరచి ఉన్న పడక గది, అందులోని మంచం మీద ఎర్రరంగు జుట్టుగల ఆమె, తెల్ల రంగు జుట్టు గల ఆయనతో మైథునంలో కనిపించింది. సుజాన్‌ని గమనించిన వారు ఇద్దరూ బయటకి వచ్చారు.
ఎర్ర జుట్టామె వణికిపోతూ తనని ఆ ఇంట్లో పదేళ్లుగా భయపెట్టే దెయ్యానివి నువ్వే’ అని చెప్పింది. తను కల్లో చూసిన వ్యక్తులు వాళ్లే అని సుజాన్ గుర్తించింది. తనకి మెలకువ వచ్చి అది కలని తెలుస్తుందని సుజాన్ అనుకుంది కాని ఈసారి అది కల కాదని తెలిసింది.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ నించి ఆ సమయంలో ఆ ఇల్లు చూడటానికి తను అపాయింట్‌మెంట్ తీసుకున్నానని టామ్ చెప్పాడు. కాని ఆ ఇల్లు అద్దెకి లేదని, తను ఎవరికీ ఫోన్‌లో అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆమె చెప్పింది. తనని పోలిన దెయ్యం ఎవరిదని సుజాన్ అడిగితే బహుశా ఆ ఇంటి యజమాని భార్యదై ఉండచ్చని, పదేళ్ల క్రితం క్రిస్మస్ ముందు రోజు తన భార్యని హత్య చేసి శవాన్ని బేస్‌మెంట్‌లో పాతి పెట్టాడని, ఆ విషయం తెలుసుకున్న అతని రెండో భార్య రెండేళ్ల క్రితం పోలీసులకి ఫిర్యాదు చేసిందని ఆ ఎర్ర జుట్టామె చెప్పింది.
తనకి వాళ్లు ఎందుకు కలలో కనిపించారో, తను ఆ ఎర్ర జుట్టామెకి దెయ్యంలా ఎందుకు కనిపించిందో సుజాన్‌కి అంతుపట్టలేదు. అది దేవుడికే తెలియాలి. ఇది స్థానిక లివర్‌పూల్ దినపత్రికల్లో వార్తగా వెలువడి నమోదైంది.

- పద్మజ