నమ్మండి! ఇది నిజం!!

పదేళ్ల తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1996లోని జీవితానికి, 2016లోని జీవితానికి ఎంతో తేడా ఉంది. 1996లో సెల్‌ఫోన్స్ అందరికీ అందుబాటులో లేవు. ఇంటర్నెట్, యాప్స్, ఫేస్‌బుక్ లాంటివి ఎరగం. ఈ 20 ఏళ్లల్లో ఎన్నో మార్పులు సంభవించాయి. డ్రెస్‌డెన్‌లోని ఓ జర్మన్ యూనివర్సిటీ వారు మరో పదేళ్లల్లో, అంటే 2025కల్లా ప్రజాజీవనంలో వచ్చే అనేక మార్పులని కనుగొన్నారు. 2025 నాటికి కొన్ని ఉత్పత్తులు నిరుపయోగమై, కొత్త ఉత్పత్తులు వినియోగంలోకి వస్తాయని వారు చెప్తున్నారు.
1.సెల్‌ఫోన్ ఛార్జ్ చేయడానికి విద్యుత్ అవసరం ఉండదు. భవిష్యత్‌లో రేడియో వేవ్స్ ద్వారా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ని చేసుకుంటారని అంచనా. రేడియో వేవ్స్‌కి పదడుగుల దూరంలో సెల్‌ఫోన్‌ని ఉంచితే చాలు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ విషయంలో తీవ్ర పరిశోధనలు చేస్తున్నాయి.
2.పర్స్‌లు, కరెన్సీ నోట్లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల వాడకం కూడా 99% తగ్గిపోతుంది. యాప్స్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతాయి. జపాన్ అంతటా ఇప్పటికే సెల్‌ఫోన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
3.అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో తక్కువ విలువ గల నాణెలు పూర్తిగా మాయం అయిపోతాయి. అమెరికాలో ఇప్పటికే ఓ పెన్నీ నాణెం ముద్రించటానికి 1.7 పెన్నీలు ఖర్చవుతోంది.
4.పదేళ్ల తర్వాత పాస్‌వర్డ్‌లు ఉండవు. నేడు ఓ మనిషికి సగటున ఐదు నించి పది పాస్‌వర్డ్‌లు ఉంటున్నాయి. వాటిని కొందరు మర్చిపోయే అవకాశం ఉంది. పాస్‌వర్డ్, పిన్‌కోడ్‌ల స్థానంలో వాయిస్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్స్ స్కాన్, ఐరిస్ స్కాన్, ఫేషియల్ రికగ్నిషన్, చేతుల్లోని రక్తనాళాల్ని గుర్తించడం లాంటి బయోమెట్రిక్స్ వస్తాయి. ఈ విషయంలో కూడా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
5.పుస్తకాలు, వీడియో గేమ్స్, సంగీతం, సినిమాలు మొదలైన సీడీలు మాయం అయిపోతాయి. టవర్స్ లోంచి డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకుని చూస్తారు. ఈ టవర్స్‌కి చందా చెల్లిస్తే చాలు. ఐతే అచ్చు పుస్తకాల వినియోగం తగ్గినా ఇంకా ఉంటాయి. పెరగచ్చని కూడా ఓ అంచనా.
6.ఇంజెక్షన్ తీసుకోవాలంటే ఎవరికైనా భయమే. ఓ లోహపు సూదిని శరీరంలో గుచ్చడం అన్నది ఎవరూ ఇష్టపడరు. 2025 తర్వాత చర్మానికి రంధ్రం చేయకుండా, బాధ తెలీకుండా జెట్ ఇంజెక్షన్ సాంకేతికత ద్వారా అల్ట్రా హైస్పీడ్‌లో శబ్ద వేగంతో లోపలకి మందుని పీల్చుకునే కొత్త విధానం వస్తుంది. కొన్ని ఇంజక్షన్లు ద్వారానే ఇచ్చే మందులు టాబ్లెట్ రూపంలో కూడా అందుబాటులోకి వస్తాయి.
7.కారుకి ఉన్న రియర్‌వ్యూ, సైడ్‌వ్యూ అద్దాలు మాయం అయి వీడియో కెమెరాలు వస్తాయి. మే 2018కల్లా అమెరికాలో వినియోగంలోకి వచ్చే కార్లన్నిటికీ వెనకాల దృశ్యం కనపడేలా వీడియో కెమెరాలని ఉంచే రియర్ వ్యూ నిబంధన ఇప్పటికే వచ్చింది. అలాగే సైడ్ వ్యూ అద్దాల స్థానంలో కూడా కెమెరాలు వస్తాయి. కెమెరాలు చవకవడమే ఇందుకు కారణం. నిత్య జీవితంలో కూడా అద్దాలు మాయమై హై రిజల్యూషన్ మానిటర్ కెమెరాలు ఆ స్థానంలో అందుబాటులోకి వస్తాయి.
8.అనాదిగా తాళాలు మనిషికి రక్షణ ఇస్తున్నాయి. ఇరవై ఏళ్ల తర్వాత ఇళ్లు, కార్లు, ఆఫీస్‌లు మొదలైన వాటికి వేసే తాళాలు మాయం అయి, అదృశ్య ఎలక్ట్రానిక్ తాళం చెవులతో వాటికి తాళం వేస్తారు. ఇందుకోసం సెల్‌ఫోన్ లేదా మరేదైనా డిజిటల్ తాళం చెవి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే పెద్ద హోటల్స్‌లో అతిథులకు టైమర్ గల ప్లాస్టిక్ కార్డులని తాళం చెవుల బదులు వాడుతున్నారు.
9.డ్రైవర్ అవసరం లేని కార్లు కూడా వస్తాయి. ఇప్పటికే అమెరికా, జపాన్‌లలో డ్రైవర్‌లెస్ కార్ల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కార్లో వెళ్లే ప్రయాణీకుడు ఆల్కహాల్ తాగి ఉన్నా, లేదా టెక్స్‌టింగ్ చేస్తున్నా అప్పుడు నేరం కాదు. పోలీసులు పట్టుకోరు. ఆ కార్లు పరిమితి మించిన వేగంతో ప్రయాణం చేయలేవు. దాంతో పోలీసుల పని బాగా తగ్గుతుంది. ఈ కారణంగా కూడా కార్లలో కెమెరాలు అధికం అవుతాయి.
10.సూపర్‌బజార్లలో చెకౌట్ క్యూలు ఉండవు. కారణం, వాటికి వెళ్లే వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అధిక శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారు. కొనడానికి ముందు ముట్టుకుని పరిశీలించాలి అనుకునే వారి కోసం ఉన్న సెంటర్లలో ఆ పని చేసి డిజిటల్‌గా ఆర్డర్ చేసి కొంటే, ఇంటికి తెచ్చి ఇస్తారు. ప్రతీ ఉత్పత్తికి అతికించిన బార్ కోడ్స్‌తో ఇప్పటికే వినియోగదారుడే కేషియర్ అవసరం లేకుండా చెల్లింపులు జరిపే సౌకర్యం చాలా దేశాల్లో ఉంది.
11.అనాదిగా బట్టలు ఉతకడానికి చాలా సమయం ఖర్చవుతోంది. ఈ విషయంలో మనిషికి బద్ధకం అధికం. పదేళ్ల తర్వాత దుస్తులని నలభై నిమిషాలు ఎండలో ఉంచితే చాలు. వాటంతట అవే శుభ్రపడతాయి. బట్టలకి ఓ రసాయనిక పదార్థాలని పూసి ఉతకకుండా శుభ్రం చేసే పరిశోధనలు 2012 నించి చైనాలో, 2016 నించి ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి.
ఇవన్నీ కేవలం నేటి పరిశోధనల ప్రాతిపదికన చేసిన ఊహాగానాలు. ఇవేకాక మధ్యలో శాస్తజ్ఞ్రులు నిశ్శబ్దంగా కనిపెట్టే మరెన్నో పదేళ్ల తర్వాత ప్రజా జీవితాన్ని ఊహాతీతమైన సౌకర్యాలతో నింపుతాయి అని కూడా డ్రెస్‌డెన్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.

పద్మజ