క్రైమ్/లీగల్

సీబీఐ నన్ను టార్గెట్ చేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: శారదా చిట్ ఫండ్ కేసులో బీజేపీ నేతల కుట్రల కారణంగానే సీబీఐ తనను టార్గెట్ చేసిందని కోల్‌కత్తా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. ఈ విస్తృత కుట్రలో బీజేపీ నేతలైన ముకుల్‌రాయ్, కైలాష్, విజయ్‌వార్ఘీయలకు సంబంధం ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో సాక్ష్యాలను కూడా ఆయన కోర్టుకు అందించారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే తనను టార్గెట్ చేశారని ఆడియో క్లిప్పులను వింటే వాస్తవం ఏమిటో అర్థం అవుతుందని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారులను టార్గెట్ చేయాలని మాట్లాడుకున్నారని, ఆడియో టేపుల్లో స్పష్టంగా వినిపించాయని కుమార్ వెల్లడించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో తనను అరెస్టు చేయాలన్న సీబీఐ అభ్యర్థనపై శనివారం తాను తన వాదన వినిపించలేకపోయానని అందుకే విచారణ వాయిదా కోరినట్లు తెలిపారు. ఈ కేసులో కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జయ్‌సింగ్ వాదనలను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయ్‌లతో కూడిన బెంచ్ పరిగణలోకి తీసుకున్నది. దీని తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.