రాష్ట్రీయం

రోజా పిటిషన్‌పై 4న సుప్రీంలో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. రోజాపై ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపి శాసనసభ చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేయడంపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును రోజా సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ సమయం ముగిసిపోవడంతో వీలుపడలేదు. దీంతో పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీలో రోజా విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై మాట్లాడేవారి గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాసమస్యలు, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారని రోజా అన్నారు. శాసనసభ నియమ, నిబంధనలను ఎపి ప్రభుత్వం తుంగలోతొక్కిందని ఆమె విమర్శించారు. తనకు సుప్రీంకోర్టు న్యాయం జరుగుతుందని ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొంటున్నారని రోజా ఆరోపించారు. అవినీతి డబ్బుతోనే తండ్రీకొడుకులిద్దరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.