క్రైమ్/లీగల్

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో జైషే కమాండర్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 27: పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ టాప్ కమాండర్ ఉగ్రవాది మున్నా లాహోరిని భారత సైనికులు మట్టుబెట్టారు. మున్నాతో పాటు తుర్కవాంగోమ్ షోపియాన్‌కు చెందిన మీర్ జీనత్-ఉల్-ఇస్లాం ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్‌ను కూడా శనివారం జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌లో భారత సైనికులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ప్రతి గ్రామాన్నీ జల్లెడ పడతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగటంగానే శుక్రవారం రాత్రి షోపియాన్ జిల్లాలోని బొన్‌బజార్ ప్రాంతంలోని బండే మొహల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా మున్నా, జీనత్‌లు కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో కార్డన్ సెర్చ్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మున్నా లాహోరి అనేక మంది భారతీయులను హతమార్చాడని పోలీసులు తెలిపారు. లాహోరి బీహార్‌కు చెందిన వ్యక్తి అయినా కాశ్మీర్ వ్యాలీలో పాక్‌కు చెందిన జైష్-ఏ-మహ్మద్ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో చేరినట్లు పోలీసులు చెప్పారు. భారీ పేలుడు పదార్థాలను తయారు చేయడంలో లాహోరి ఆరి తేరినట్లు వారు తెలిపారు. మార్చి 30న బనిహాల్‌లో సైనిక దళాల కవాతు నిర్వహిస్తున్న సమయంలో కారు బాంబు పేల్చిన ఘటనలో లాహోరి కీలక పాత్ర పోషించాడని, ఆ తర్వాత జూన్ 17న పుల్వామాలో సైనిక దళాల వాహనం వెళుతున్నప్పుడు కారు బాంబు పేల్చిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృత్యువాత పడడానికి లాహోరి కారణమని వారు పేర్కొన్నారు. మీర్ జీనత్- ఉల్-ఇస్లాం అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు.