రాష్ట్రీయం

ఉత్కళ్ వర్శిటీ విసిగా కమల్ మిశ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ఒరిస్సాలోని ఉత్కళ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కమల్ కె మిశ్రా నియమితులయ్యారు. ఆంత్రోపాలజీ డిపార్టుమెంట్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్న కమల్ కె మిశ్రా మూడేళ్ల కాలపరిమితికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ యూనివర్శిటీని 1990లో స్థాపించారు. భువనేశ్వర్‌లో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధన, బోధనతో పాటు సాంస్కృతిక ప్రచారం ప్రధానంగా పనిచేస్తోంది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్లాంట్ సైనె్సస్ అసోసియేట్ ప్రొఫెసర్ గాపనిచేస్తున్న డాక్టర్ ఎస్ రాజగోపాల్‌ను నేషనల్ అకాడమి ఆఫ్ సైనె్సస్ ఫెల్లోషిప్‌తో సత్కరించింది. జీవశాస్త్రంలో పత్రహరితానికి సంబంధించి క్లోరోపాస్టా గురించి ఆయన చేసిన పరిశోధనలను నేషనల్ అకాడమి గుర్తించింది.