బిజినెస్

మార్పుచేయలేని ప్రాధాన్యతా వాటాలను విడుదల చేసిన ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ మార్పుచేయలేని ప్రాధాన్యతా వాటాలను బుధవారం విడుదల చేసింది. ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంతో విడుదలైన ఈ వాటాల ద్వారా రూ. 300 కోట్ల నిధులను సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు మొత్తం మూడు కోట్ల వాటాలను విడుదల చేయగా, ఇందులో ఒక్కో వాటా ధర రూ. 100 ముఖ విలువతో కూడుకుని ఉంది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఈ మేరకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలను వెల్లడించింది. ఈ ప్రాధాన్యత వాటాలకు 7.50 శాతం డివిడెండ్‌ను కల్పించామని, ప్రతి ఏటా దీన్ని పంపిణీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇలావుండగా ఈ కంపెనీ వాటాలు బుధవారం 1.73 శాతం తగ్గుదలతో బీఎస్‌ఈలో ఒక్కోవాటా రూ. 116.25గా ట్రేడయ్యాయి.