రాష్ట్రీయం

ఖాతాలు జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: రద్దయిన పెద్ద నోట్లలో ఉన్న తమ నల్ల ధనాన్ని కొంతమంది ఇతరుల జన్‌ధన్ బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల పట్ల కేంద్రం అప్రమత్తమయింది. ఇతరుల పాత నోట్లను తమ ఖాతాలలో జమ చేయడం ద్వారా తమ ఖాతాలను దుర్వినియోగం చేస్తే ఆదాయపు పన్ను చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని జన్‌ధన్ ఖాతాదారులను, గృహిణులను, చేతివృత్తుల వారిని ప్రభుత్వం శుక్రవారం హెచ్చరించింది. డిసెంబర్ 30 వరకు ఉన్న గడువులోగా ఎవరు కూడా ఇతరుల పాత నోట్లను తమ ఖాతాలలో జమ చేయకూడదని సూచించింది. కొంతమంది కమిషన్ తీసుకొని తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా ఇతరుల పాత నోట్లను మార్చి ఇస్తున్నట్టు వివిధ ప్రాంతాల నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసింది. రూ. 2.50 లక్షలు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ పరిమితి వరకు ఎవరైనా తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటే,
వాటిని తనిఖీ చేయబోమని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదేవిధంగా జన్‌ధన్ ఖాతాలో రూ. 50వేల వరకు పాత నోట్లు జమ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు తమ ఖాతాలో రూ. 2.50 లక్షల వరకు పాత నోట్లను జమ చేసుకుంటే ఎలాంటి చర్య ఉండబోదనే భావనలో ప్రజలు ఉన్నారని ఆదాయపు పన్ను శాఖ గమనించింది. అయితే ఒకవేళ జమ చేసిన మొత్తం ఖాతాదారునిది కాదని, ఇతరులు అందులో జమ చేసుకున్నారని తేలితే ఆదాయపు పన్ను చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వివరించింది. పన్ను ఎగవేతను ప్రోత్సహించిన అభియోగాలపై ఇతరుల పాత నోట్లను జమ చేసిన ఖాతాదారులను ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని పేర్కొంది. 50 రోజుల గడువులోగా నల్లధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్ను, వడ్డీతో పాటు 200 శాతం జరిమానా చెల్లించవలసి ఉంటుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
ప్రజలు కమిషన్లకు ఆశపడి ఇతరుల నల్లధనాన్ని తమ ఖాతాల్లో జమ చేయడం ద్వారా తెల్లధనంగా మార్చొద్దని ప్రభుత్వం కోరింది. దేశ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తే తప్ప నల్ల ధనాన్ని నిర్మూలించాలనే ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కాబోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి కార్యకలాపాలను ప్రజలు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసికెళ్లాలని కోరింది. దీనివల్ల ఆ శాఖ వెంటనే చర్య తీసుకుంటుందని, అలాంటి అక్రమ నగదు బదిలీని నిలిపివేసి, సంబంధిత నగదును స్వాధీనం చేసుకుంటుందని వివరించింది.