బిజినెస్

ముందుంది మంచి కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, డిసెంబర్ 12: వేతన జీవులకు శుభవార్త. ఆసియా-పసిఫిక్ దేశాల్లో వచ్చే ఏడాది అత్యధికంగా వేతనాలు పెరిగేది భారత్‌లోనేనని ఓ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక చెబుతోంది. భారత్‌లో 10.8 శాతం వేతనాల పెంపు ఉంటుందని మెర్సర్ సంస్థ అంచనా వేసింది.
ఆ తర్వాత వియత్నాంలో 9.2 శాతం వేతనాలు పెరుగుతాయని పేర్కొంది. ఇక ఆసియా దేశాల్లో ఆర్థిక పరిపుష్టికి నిలయమైన హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో 2017లో వేతనాల పెంపు వరుసగా 4.2 శాతంగా, 4.1 శాతంగా ఉంటాయని వార్షిక టోటల్ రెమ్యునరేషన్ సర్వే (టిఆర్‌ఎస్) ఆధారంగా రూపొందించిన ‘కాంపెనే్సషన్ ప్లానింగ్ ఫర్ 2017’ నివేదికలో మెర్సర్ అంటోంది.
జపాన్‌లో ఈ పెంపు అతి తక్కువగా 2.2 శాతంగానే ఉండొచ్చన్న మెర్సర్.. న్యూజిలాండ్‌లో 2.8 శాతం, ఆస్ట్రేలియాలో 2.9 శాతం చొప్పున వేతనాలు పెరగవచ్చని అంచనా వేసింది. ఇదిలావుంటే ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాల్లో వార్షిక వేతనం 30 వేల డాలర్లతో మొదలవుతుందని, పదోన్నతులపై ఇదికాస్తా 2 లక్షల 50 వేల డాలర్ల నుంచి 3 లక్షల 50 వేల డాలర్లకు వెళ్లే అవకాశాలున్నాయని మెర్సర్ చెప్పింది. ప్రస్తుతం వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని మెర్సర్ భాగస్వామి పునీత్ స్వాని అన్నారు. కాగా, లైఫ్ సైనె్సస్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లో వేతనాల వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంటుందని మెర్సర్ తెలిపింది.