ఆంధ్రప్రదేశ్‌

పారాహు‘షార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 14: ఒకే రాకెట్..104 ఉపగ్రహాల ప్రయోగం. ఇది మన శాస్తవ్రేత్తల సాంకేతిక సామర్ధ్యానికి పరీక్షలాంటిది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగంతో సందడి వాతావరణం నెలకొంది. 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపిస్తుండడంతో అందరి చూపు షార్‌వైపే పండింది. ఇప్పటికే విదేశీ శాస్తవ్రేత్తలు కూడా చేరుకుని మన శాస్తవ్రేత్తలతో కలసి ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. భద్రత ఏర్పాట్ల కోసం షార్‌ను సిఐఎస్‌ఎఫ్ బలగలాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. శ్రీహరికోట చుట్టు పక్కల ఉన్న అడవులను సైతం జల్లెడ పట్టి గాలిస్తున్నారు. తీరప్రాంత గ్రామాల్లో, సముద్ర జలమార్గాల్లో మెరైన్ సిబ్బంది నిఘా పెట్టారు.
60వ ప్రయోగం.. ప్రాధాన్యం
షార్ నుండి ఇప్పటి వరకు 50 ప్రయోగాలు చేపట్టారు. ఇది 60వ ప్రయోగం కాగా ఒకే సారి 104 ఉపగ్రహాలను పంపించడం విశేషం. ఇప్పటి వరకు ఒకేయత్నంలో 20 ఉపగ్రహాలను మాత్రమే కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయోగం చేశారు. ఇప్పుడు ఒకేయత్నంలో ఏకంగా 104 ఉపగ్రహాలను పంపిస్తుండడంతో యావత్ ప్రపంచం ఇటే చూస్తున్నది. ఈ ప్రయోగం కోసం అతి తక్కువ కాలంలోనే రాకెట్‌ను రూపొందించి ఘనత చాటారు. ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం వల్ల విదేశాలు సైతం మన వాహక నౌకల నుండే ఉపగ్రహాలను పంపించేందుకు క్యూకడతాయి. దీంతో భారత్ వాణిజ్య పరంగా ముందుకు దూసుకెడుతుంది. ప్రపంచ దేశాలల్లో ఏ దేశం శాస్తవ్రేత్తలు చేయని సాహసానికి మనవారు పూనుకున్నారు.
సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాలు కూడా ఇంతవరకు ఒక రాకెట్ ద్వారా ఇన్ని ఉపగ్రహాలు పంపించలేదు. ఈ ప్రయోగం మన శాస్తవ్రేత్తల పనితీరుకు నిదర్శనం. మంగళవారం ఉదయం 9:28 గంటలకు షార్ నుండి 104 ఉపగ్రహాల ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వాహకనౌక ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2డి, మరో రెండు చిన్న నానో ఉపగ్రహాలు, 101 విదేశీ ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ మోసుకెళ్లనుంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్‌తో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకుని ప్రయోగ ఏర్పాట్లో బిజిబిజీగా ఉన్నారు.

చిత్రం..షార్ కేంద్రం ఏరియల్ వ్యూ