రాష్ట్రీయం

నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యుల సేవలను వ్యవస్థీకృతం చేసి అదుపులోకి తెచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జె.పి నడ్డాను కోరారు. ఖాన్ ఈ మేరకు నడ్డాకు లేఖ రాశారు. రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తే తప్ప ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలను అదుపు చేయటం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రి దోపిడీకి సంబంధించిన పలు సంఘటనలు తన దృష్టికి వచ్చాయంటూ ఆయన మూడు సంఘటనల గురించి నడ్డాకు రాసిన లేఖలో వివరించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పిఆర్‌ఓ రవీందర్ యశోదా ఆసుపత్రిలో మరణించటం గురించి కూడా ఖాన్ తన లేఖలో ప్రస్తావించారు. యశోదా ఆసుపత్రి వైద్యులు సరైన పద్ధతిలో వైద్య సేవలు అందజేయకపోవటం వల్లనే రవీందర్ మరణించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జెపి నడ్డాకు రాసిన లేఖలో తెలిపారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందజేస్తామంటూ ప్రభుత్వం నుండి భూమి, ఇతర సౌకర్యాలు, పన్ను మినహాయింపులు పొందుతున్న ఆసుపత్రులు ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యుల సేవలను అదుపు చేసేందుకు సంబంధించిన రెగ్యులేటరీ అథారిటీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రతిపాదించాలని ఖాన్ డిమాండ్ చేశారు.