బిజినెస్

కొత్త సంస్థలతో కాసుల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించిన ఐదు సంస్థల్లో నాలుగు సంస్థలు.. మదుపరులకు రెండింతల లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) సూచీ సెనె్సక్స్ ఈ జనవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 11 శాతం పెరిగింది.
ఈ క్రమంలోనే ఈ నెల 5న గరిష్ఠంగా 30,007.48 పాయింట్లను తాకింది. దీంతో స్టాక్ మార్కెట్లలోకి కొత్తగా వచ్చిన సంస్థల షేర్ల విలువ ఒక్కసారిగా ఆకాశానికేసి పరుగులు పెట్టింది. ఇక మదుపరులకు ఈ యేడు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సంస్థల్లో రిటైల్ మార్కెట్ దిగ్గజం డి-మార్ట్ నిర్వహణదారైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ ముందుంది.
299 రూపాయలకు స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించిన ఈ సంస్థ షేర్ విలువ 2.62 రెట్లు పెరిగింది. అలాగే శంకర బిల్డింగ్ ప్రోడక్ట్స్ షేర్ విలువ 64.68 శాతం ఎగిసింది. 460 రూపాయల షేర్ ధరతో ఇది ఐపిఒకు వచ్చింది. ఇక బిఎస్‌ఇ కూడా ఈ ఏడాదే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో లిస్టవగా, దీని షేర్ విలువ ఇప్పటిదాకా 27.54 శాతం ఎగిసింది. 806 రూపాయల ధరతో ఇది ఐపిఒకు వచ్చింది.
ఇక 333 రూపాయల వద్ద స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ షేర్ విలువ 7.64 శాతం పుంజుకుంది. అయితే సిఎల్ ఎడ్యుకేట్ షేర్ల విలువ మాత్రమే తగ్గింది. 502 రూపాయలతో దీని షేర్లు స్టాక్ మార్కెట్‌లోకి అడుగిడగా, ఇప్పటిదాకా జరిగిన ట్రేడింగ్‌లో 15.19 శాతం మేర విలువ కోల్పోయాయి. కాగా, నిరుడు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 26 సంస్థలు ప్రవేశించగా, 26,000 కోట్ల రూపాయలకుపైగా నిధులను సమీకరించాయి. 2010 నుంచి గమనిస్తే ఇదే అత్యధికం.
మరోవైపు చిన్న, మధ్యతరహా సంస్థలు గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపిఒ) ద్వారా 811 కోట్ల రూపాయల నిధులను సమీకరించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే ఇది రెండింతలకుపైగా ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం మొత్తం 80 సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి.
2015-16లో 46 సంస్థలు రాగా, 304 కోట్ల రూపాయలను పొందాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 37 సంస్థలు.. 271 కోట్ల రూపాయలను అందుకున్నాయి. కాగా, 2016-17లో ఐపిఒకు వచ్చిన చిన్న, మధ్యతరహా సంస్థల్లో గుజరాత్‌కు చెందినవి అత్యధికంగా 33 ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర (15), రాజస్థాన్ (10), పశ్చిమ బెంగాల్ (4), ఢిల్లీ (3) ఉన్నాయి.
ఇదిలావుంటే గత నెల మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు 42 శాతం పెరిగి 17.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. 2015-16లో 12.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయని పరిశ్రమ సంఘం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది. మదుపరులు పెట్టుబడులకు అమితాసక్తిని కనబరిచారని చెప్పింది.