రాష్ట్రీయం

మానవ హక్కులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: కాశ్మీర్‌లోయలో మానవ హక్కుల పరిరక్షణకు భారత సైన్యం పెద్దపీట వేస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులపై రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలను ఆర్మీ పట్టించుకోదని, ఆర్మీకి భారత ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని సాధించడమే కర్తవ్యమని రావత్ అన్నారు. రేయింబవళ్లు సరిహద్దుల పరిరక్షణకు, దేశ భద్రతకు పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని స్పష్టం చేశారు. కాశ్మీర్ ప్రజల్లో అభద్రతా భావం పెంపొందించేందుకు కొన్ని శక్తులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రచారాలవల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. శనివారం దుండిగల్‌లో భారత వైమానిక దళానికి చెందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, కాశ్మీర్‌లో పరిస్థితులు అదుపుతప్పినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లోయలో భారత సైన్యం త్యాగనిరతితో దేశ సరిహద్దుల సంరక్షణకు పోరాడుతోందన్నారు. దక్షిణ కాశ్మీర్‌లో కొన్ని చోట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా, అల్లరిమూకల ఆటకట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. కాశ్మీర్‌లోయలో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని, ప్రజలతో కలిసి ఆర్మీ పనిచేస్తోందని, దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. భారత ఆర్మీ ప్రజలకు చెందినదని, ప్రజా సైనికులుగా ఆర్మీ దళాలు పనిచేస్తున్నాయన్నారు. భారత ప్రభుత్వ ఆదేశం మేరకు నిర్దేశించిన లక్ష్య సాధనకు అంకితభావంతో ఆర్మీ పనిచేస్తోందన్నారు. కాశ్మీర్‌లో తమ అవసరాన్ని గుర్తించే కాశ్మీర్ లోయలో ఆర్మీని రంగంలోకి దింపారన్నారు. శాంతిని నెలకొల్పడమే తమ ముందున్న లక్ష్యం అని రావత్ అన్నారు. లోయలో దారి తప్పిన కొంత మంది యువకులు ఆయుధాలు పట్టుకున్నారని, వీరు త్వరలోనే హింసకు స్వస్తి చెప్పి సాధారణ జీవితంలోకి వస్తారని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. లోయలో శాంతి సాధన లక్ష్యంగా సంక్లిష్ట స్థితిలో కూడా ఓర్పు వహిస్తున్నామన్నారు. బడి పిల్లలు రాళ్లు విసురుతున్నా మానవ హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా అప్రమత్తంగా ఉంటున్నామన్నారు.

చిత్రం.. దుండిగల్‌లో శనివారం వైమానిక దళానికి చెందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పట్టాలను ప్రదానం చేస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్