తెలంగాణ

మమత దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూన్ 19: ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను కోరుతూ గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలు సోమవారం మరింత తీవ్రంగా మారింది. డార్జిలింగ్ ప్రాంతం గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తల ఆందోళనలతో అట్టుడికింది. పరిస్థితి అదుపుతప్పటంతో ఈ కొండప్రాంత వీధుల్లో భద్రతాదళాలు కవాతు చేశాయి. నేడు కూడా ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఇచ్చితీరాల్సిందేనంటూ జిజెఎం ఆందోళనకారులు నిరసనకు దిగారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చౌక్‌బజార్ ప్రాంతంలోని వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్యకర్తలు గూర్ఖాలాండ్ సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటికే మా కార్యకర్తలు ముగ్గురు చనిపోయారు. మరిన్ని ప్రాణాలు పోయినా సిద్ధంగా ఉన్నాం. గూర్ఖాలాండ్ సాధించేవరకు ఈ నిరసన జ్వాలలు ఆగవు’ అని జిజెఎం నాయకుడొకరు స్పష్టం చేశారు.
చిత్రం.. ముఖ్యమంత్రి మమత దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న జిజెఎం ఆందోళనకారులు