తెలంగాణ

తెలంగాణ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: తెలంగాణలో కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసార పరీక్షల నిర్వహణ పథకాలను దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించారు. నరేంద్ర మోదీ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సమావేశమై తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులు, అమలు జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసార పరీక్షల పథకాల గురించి కెసిఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ మూడు పథకాలు చాలా బాగున్నాయి, వీటి వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలగటంతోపాటు కరవు పరిస్థితులను శాశ్వతంగా నివారించేందుకు వీలుంటుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ పథకాల అమలు తీరును అధ్యయనం చేసేందుకు బృందాన్ని పంపించాలని ఆయన పిఎంఓ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకాలను అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు మోదీ సూచించారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కెసిఆర్ ప్రధాన మంత్రికి పలు సూచనలు చేశారు. ఆయన పలు పథకాల విషయంలో ప్రధానమంత్రికి పలు సూచనలు చేశారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విలేఖరులతో చెప్పారు. కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలనీ, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని కెసిఆర్ సూచించినట్లు తెలిపారు. కేంద్రం వద్ద ఇలాంటి పథకాలు లేవని మోదీకి కెసిఆర్ స్పష్టం చేశారన్నారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించి పంటల కాలనీలు గుర్తించాలని, పంటల మార్పిడి విధానంపైనా కెసిఆర్ వివరించారని కడియం తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తారే తప్ప అమలు జరగడం లేదనీ, కేంద్రం వద్ద సరైన మానిటరింగ్ వ్యవస్థ లేదని కెసిఆర్ స్పష్టం చేశారని వెల్లడించారు. ఎరువుల పంపిణీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారన్నారు. రాష్ట్రాల డిమాండ్ ప్రకారం ఎరువులు పంపిణీ చేసే విధానం మంచిది కాదనీ, పరిస్థతుల ఆధారంగా నెల రోజుల ముందే ఎరువులు ఆయా రాష్ట్రాలకు చేరుకునేలా ప్రణాళిక ఉండాలని కెసిఆర్ ప్రధానికి సూచించారన్నారు. కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేశారని, వాటిపై నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని కడియం శ్రీహరి చెప్పారు.

చిత్రం ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్...
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి