రాష్ట్రీయం

అవకతవకలుంటే నిధులు ఆపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జూన్ 16: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ విద్యుదీకరణ పథకాలు, పట్టణాల్లో విద్యుత్ వౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి వాటికి సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగితే సదరు రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ హెచ్చరించారు.
ఉమ్మడి సేకరణ వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని కోరారు. అన్ని అంశాలను తులనాత్మకంగా విశే్లషించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే విద్యుత్ పథకాల అమలులో, వాటికి కేటాయించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగితే మాత్రం అందుకు పాల్పడ్డ రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని చెప్పారు. గురువారం నాడిక్కడ మొదలైన విద్యుత్ మంత్రులు, కార్యదర్శుల రెండు రోజుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గ్రామీణ విద్యుదీకరణ, పట్టణాల ఆధునీకరణకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చించారు. వీటి అమలుకు సంబంధించి ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యల్ని పరిశీలిస్తామని, సేకరిస్తున్న ఉత్పత్తుల నాణ్యతనూ విశే్లషిస్తామని చెప్పారు. వీటి విషయంలో ఎలాంటి తేడాలున్నా చర్యలు తప్పవని, కేంద్రం కంటే నాణ్యమైన పరికరాలను రాష్ట్రాలు సమీకరించుకోగలిగితే ఆ ప్రయత్నాలకు ప్రోత్సాహాన్ని అందిస్తామని వెల్లడించారు. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకాన్ని ఉమ్మడి లక్ష్యంతో చేపట్టి అమలు చేయడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలుంటాయని తెలిపారు.