రాష్ట్రీయం

ఏపీ భూసేకరణ చట్టానికి రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ(సవరణ)చట్టానికి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.దీనికి సంబంధించిన ఫైల్‌పై రాష్టప్రతి సంతకం చేసినట్టు ఏపీభవన్ అధికారులు మంగళవారం వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం సవరణలతో కూడిన బిల్లును శాసన సభ 2017లో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది.కేంద్రానికి పంపిన అనంతరం అనేక సంప్రదింపులు, చర్చల అనంతరం కేంద్రహోంశాఖ,న్యాయశాఖలు ఆమోదం తెలిపాయి.ముందుగా న్యాయశాఖ ఈ ఫైల్‌ను ఆమోదం తెలిపిన అనంతరం హోంశాఖకు పంపించింది.
హోంశాఖ కూడా ఈ ఫైల్‌కు ఆమోదం తెలిపిన అనంతరం రాష్టప్రతి ఆమోదానికి పంపించారు. ఏపీ రూపోందించిన భూసేకరణ సవరణ చట్టానికి రాష్టప్రతి కూడా చివరగా ఆమోదముద్ర వేశారు.
కేంద్రం గతంలో తీసుకోచ్చిన భూసేకరణ చట్టానికి సవరణలు చేసుకొనేందుకు రాష్ట్రాలకు ఈ చట్టంలో వేసులబాటు కల్పించింది. ఈ పరిస్థితుల్లో ఈ చట్టానికి రాష్ట్ర పరిస్థితులకు అనుకులంగా కొన్ని సవరణలు చేస్తూ కేంద్రం ఆమోదానికి పంపించింది.ఏపీ సవరణలతో కూడిన భూసేకరణ చట్టానికి కేంద్రం,రాష్టప్రతి కూడా ఆమోదముంద్ర వేశారు.