క్రైమ్/లీగల్

న్యాయవ్యవస్థ.. అతివలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారతదేశంలో లింగ వివక్ష కొనసాగుతోందని, మహిళలకు చాలా రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఒక విమర్శ ఉంది. ఈ వివక్షతను రూపుమాపడానికి వివిధ రంగాల్లో అనేకమార్గాల్లో కృషి జరుగుతోంది. మహిళా సంఘాలు, రాజకీయ నేతలు, సామాజికవేత్తలు మహిళలకు జరుగుతున్న వివక్షపై నిత్యం ఎలుగెత్తుతూనే ఉన్నారు. మహిళల కోసం పలు చట్టాలున్నా అవి సక్రమంగా అమలు కావడం లేదని వీరు విమర్శిస్తున్నారు. అయితే లింగ వివక్షతపై, మహిళల సమానత్వం, హక్కులపై ఈ ఏడాది న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పులు అతివలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయని పేర్కొంటున్నారు న్యాయనిపుణులు. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ దర్శనం కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు, నిర్భయపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్ కొట్టివేత, కథువా కేసులను వారు ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నారు. అలాగే దేశంలోని పలు శరణాలయాలలో అనాథ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై, ముఖ్యంగా బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఉదంతంపై కోర్టు స్పందించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అలాగే ఈ కేసు విచారణలో బిహార్ మాజీ మంత్రి మంజు వర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ వర్మ నుంచి పెద్దయెత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం, తదనంతర పరిణామాలలో ఆమె పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియన్ పినల్ కోడ్‌లోని 497 సెక్షన్ చెల్లదంటూ పేర్కొంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణపై ఆమెపై ఎలాంటి ఎలాంటి చర్య తీసుకోలేమని, ఇద్దరు మేజర్లు ఇష్టప్రకారం ఏర్పర్చుకున్న వివాహేతర సంబంధం చట్టబద్ధమేనని సంచలన తీర్పు ప్రకటించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టికి వెళ్లిన జమ్మూలోని ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన కథువా ఉదంతంపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యవహరించిన విధానం ప్రశంసలు అందుకుంది. ఈ కేసులో బాధితురాలి వివరాలను ప్రచురణ, ప్రసారం చేసినందుకు కొన్ని మీడియా సంస్తలకు పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశించింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్య, అత్యాచారం కేసుకు సంబంధించి మరణశిక్ష పడిన నలుగురు నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే అత్యాచార బాధితులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 6,500 రూపాయలను పరిహారంగా చెల్లించడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.