బిజినెస్

వాహన బీమా సెటిల్మెంట్లకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: వాహన బీమా సెటిల్మెంట్ల కోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్టు భారతి ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఈ విధానం ద్వారా ఖాతారులు, భాగస్వామ్య గ్యారేజీలు తమతమ క్లెయిమ్స్ లేదా సెటిల్మెంట్స్‌ను సత్వరమే పూర్తి చేసుకోవడానికి వీలుంటుందని భారతి ఏఎక్స్‌ఏ తన ప్రకటనలో పేర్కొంది. వెహికిల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన క్లెయిమ్స్‌లో ఈఏడాది కనీసం 20 నుంచి 25 శాతం వరకూ కేసులను ఈ కొత్త విధానంలోనే పరిష్కరించాలన్నది లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలిపింది. మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌లో ప్రత్యక్ష సమాచారాన్ని అందుకోవడానికి ఈ విధానంలో అవకాశం ఉంది. ఖాతాదారులు నేరుగా వీడియో క్లిప్పింగ్‌లను లేదా లైవ్ వీడియోలను అప్పటికప్పుడే కంపెనీకి పంపవచ్చు. పరిస్థితిని సమీక్షించుకొని, క్లెయిమ్స్‌కు తక్షణ పరిష్కారాన్ని అందించే వీలుంటుంది. ఇప్పటి వరకూ అనుసరిస్తున్న విధానాల్లో, వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు లేదా దొంగిలించిబడినప్పుడు ఆ సమాచారాన్ని పంపడానికి రోజులు, వారాలు పట్టేది. వాటిని పరిశీలించిన తర్వాత క్లెయిమ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికకి లేదా ఏవైనా అనుమానాలు ఉంటే తీర్చుకోవడానికి బీమా కంపెనీ మరికొంత సమయం తీసుకునేది. ఫలితంగా క్లెయిమ్స్‌లో తీవ్ర జాప్యం కావడం, ఖాతాదారులు ఆగ్రహానికి, ఆందోళన చెందడం సర్వసామాన్యంగా ఉండేది. ఈ సమస్యలను నివారించడానికి భారతి ఏఎక్స్‌ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా క్లెయిమ్స్ ఎంత తొందరగా పరిష్కారమవుతాయన్నది చూడాలి.