రాష్ట్రీయం

నవాజ్‌పై జీవితకాల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 13: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా షరీఫ్‌పై జీవితకాలం నిషేధం విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌కు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. రాజ్యాగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్)ను అనుసరించి షరీఫ్ మరో ఇద్దరు నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధంచారు. అలాగే వారు ఎక్కడా ఎలాంటి సభల్లోనూ ప్రసంగించడానికి వీల్లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. పనామా పేపర్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నవాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హడిగా 2017 జూలై 28న కోర్టు ప్రకటించింది. దీంతో షరీఫ్ ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కుమారుడు కంపెనీ నుంచి పొందిన వేతనానికి సంబంధించి 2013 గణాంకాలు అందజేయాలదని షరీఫ్‌పై ఆరోపణలు. 68 ఏళ్ల నవాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ ముస్లిం లీక్-నవాజ్ అధ్యక్ష పదవికీ అనర్హుణ్ని చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. రాజ్యాంగం నియమ, నిబంధనల ప్రకారం ఒకసారి ఉన్నత పదవికి అనర్హుడైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోతాడని బెంచ్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేసి ప్రధాని అవ్వాలనుకున్న నవాజ్‌షరీఫ్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జూన్‌లో జరగనున్నాయి. అలాగే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్ సాఫ్(పీటీఐ) నాయకుడు జహంగీర్ తరీన్‌పైనే సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్ 15న సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ తరీన్‌పై అనర్హత వేటు వేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ తీర్పును చదివి వినిపించారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 14న తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అయితే అనర్హతకు సంబంధించి 17 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇలా ఉండగా నవాజ్ షరీఫ్‌పై జీవితకాల నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును సమాచార శాఖ సహాయ మంత్రి మిర్రియం ఔరంగజేబ్ ఎద్దేవా చేశారు. ఇదొక జోక్ అంటూ ఆయన కొట్టిపారేశారు. గతంలోనూ అనేక మంది మాజీ ప్రధానులపై అవినీతి ఆరోపణలు వచ్చాయని అప్పుడు లేనిది కొత్తగా ఈ తీర్పు ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో దేశ ప్రధానులుగా పనిచేసిన 17 మందిపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. ఇది ఆలీబాబా 40 దొంగల కుట్రను తలపిస్తోందని మిర్రియం వ్యాఖ్యానించారు. ‘షరీఫ్ ఎప్పటికీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ సారథే. ప్రజల హృదయాల్లో ఆయన పేరు, ప్రఖ్యాతలు పదిలంగా ఉంటాయి. నవాజ్ విషయంలో అనర్హత అన్నదానికి అసలు అర్థమేలేదు’అని సమాచార మంత్రి స్పష్టం చేశారు.