రాష్ట్రీయం

కామాంధులకు మరణశిక్షే సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అమానుష లైంగిక దాడి, హత్య ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. 12 ఏళ్ల బాలికలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే కామాంధులకు మరణశిక్షే సరైందని కేంద్ర స్ర్తి,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనెస్ట్ సెక్సువల్ అఫెనె్సస్ చట్టం (పీఓసీఎస్‌ఓ) సవరించాలని తన మంత్రిత్వశాఖను ఆదేశించారు. 12 ఏళ్ల లోపుబాలికలపై లైంగిదాడికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించాలన్న వాదనను మేనకాగాంధీ గట్టిగా సమర్ధించారు. కామాంధులకు మరణశిక్ష విధించేలా పీఓసీఎస్‌ఓ చట్టంలో మార్పులు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ‘కథువాలో ఎనిమిదేళ్ల బాలిక గ్యాంగ్‌రేప్, హత్య ఘటన నన్ను ఎంతగానో బాధించాయి. ఇటీవల బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఇవి అత్యంత దురదృష్టకరం. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారికి మరణశిక్షే సరైందన్నది మహిళ, శిశు అభివృద్ధి మంత్రిగా నా అభిప్రాయం. దీని కోసం పీఓసీఎస్‌ఓ చట్టం మార్చాలి’ అని స్పష్టం చేశారు.