రాష్ట్రీయం

రేపిస్టులకు మరణ శిక్షే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రేపిస్టులకు మరణశిక్ష విధించాలన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ అభిప్రాయంతో ఒకప్పటికి డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని ఏకీభవించారు. 12 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడులకు తెబడుతున్న మృగాలకు ఉరే సరైన శిక్ష అం టూ మేనకాగాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. దీని కోసం చట్టాన్ని సవరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘అభంశుభం తెలియని బాలికలపై తెగబడుతున్న మానవ మృగాలను వదలిపెట్టొదు. ఇలాంటి చీడ పురుగులకు మరణశిక్షే సరైంది’ అంటూ ఎంపీ హే మమాలిని శనివారం ట్వీట్ చేశారు. ఈ ఆటవిక చ ర్యలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్య మం చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. దీనికి మీడి యా కూడా మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘నిత్యం ఏ పత్రిక తిరగేసినా అత్యాచారం వార్తలే. ఉన్నావ్, కథువాలో జరిగిన సామూహిక అత్యాచా రం ఘటనలు మన సభ్యసమాజానికే సిగ్గుచేటు. బాలికలపై ఘాతుకాలకు పాల్పడిన కామాంధులు మనుషులేనా? ఆ దుర్మార్గులను ఉరితీయడమే వారికి తగిన శిక్ష’ అంటూ హేమమాలిని ఉద్వేగం తో అన్నారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగే జాతీయ ఉద్యమానికి మీడియా అండదండలు అవసరమని మధుర ఎంపీ ట్వీట్ చేశారు. ఈ విషయంలో మేనకాగాంధీ అభిప్రాయానికి తాను మ ద్దతు తెలుపుతున్నానని ఆమె ప్రకటించారు.