రాష్ట్రీయం

ఎంపిక ప్రక్రియ సాగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: లోక్‌పాల్ సెలక్షన్ కమిటీ సారథి ఎంపిక ప్రక్రియ సాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. కమిటీ చైర్మన్‌గా న్యాయ నిపుణున్ని నియమించదలిచామని, ఆయన ఎంపిక ప్రక్రియ సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రక్రియ పూర్తయిన వెంటనే లోక్‌పాల్ నియామకం పూర్తిచేస్తామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడించారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తిచేయాలని కేంద్రానికి సూచించింది. కేసు తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. అలాగే నియమకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న బెంచ్ లోక్‌పాల్ నియామకాలు సాధ్యమైంత త్వరగా పూర్తిచేయాలన్నారు. సీనియర్ అడ్వొకేట్ పీపీ రావు తొలుత ఎంపిక కమిటీకి ఎంపికయ్యారు. అయితే ఆయన అకాల మరణంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది. లోక్‌పాల్ నియమకాలు జరపాలని గతేడాది ఏప్రిల్‌లో సుప్రీం ఆదేశించినా ఇప్పటికీ జరగలేదు.