రాష్ట్రీయం

పోలవరంపై అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: గోదావరి నదీ జలాల వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకి అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందా లేదా అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర జల వనరుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల నీటి నిల్వ ఉండేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలని, అయితే ప్రస్తుతం 50 క్యూసెక్కుల నీటి నిల్వ ఉండేలా నిర్మాణం చేపడుతున్నారని వాదించారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని ఒడిశా వాదనపై తమ అభిప్రాయం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. దీనిపై ఏపీ తరఫున న్యాయవాది గుంటూర్ ప్రభాకర్ వివరణ ఇస్తూ తాము బచావత్ అవార్డును అనుసరించే నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని కార్యదర్శుల స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇస్తే, ఇంజనీర్ చేత అఫిడవిట్ దాఖలు చేస్తారా అని ప్రశ్నించింది. దీనిపై మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర జలవనరుల శాఖకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.