రాష్ట్రీయం

మా అమ్మలోనే భారతీయత ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 10: ‘ఈ దేశంలో చాలామంది భారతీయుల కంటే మా అమ్మ లోనే భారతీయత ఎక్కువ’ అని రాహుల్ గాంధీ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ఇటీవల సోనియాగాంధీ విదేశీ మూలాల గురించి ప్రస్తావించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ- ‘మా అమ్మ పుట్టుకతో ఇటలీ దేశస్తురాలు కావచ్చు. కాని ఈ దేశంకోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. జీవితంలో ఎక్కువ భాగం ఈ దేశంలోనే నివసించారు. ఇక్కడి ప్రజలు, సంస్కృతితో మమేకమయ్యారు. నేను చూసిన వారిలోకంటే ఎక్కువగా భారతీయత మా అమ్మలో ఉంది’ అని ఆయన అన్నారు. ఈ దేశాభివృద్ధికోసం సోనియా తపించారని, ప్రధాని స్థానంలో ఉన్న మోదీ తన స్థాయిని దిగజార్చుకుని ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఈ ప్రకటనలు చేయడం వల్ల ఆనందం వస్తే తాను చేయగలిగేదేమీ లేదన్నారు. ఈ నెల 1వ తేదీన కర్నాటక ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలపై 15 నిమిషాల సేపు ఆపకుండా రాహుల్ గాంధీ మాట్లాడగలరా, కనీసం తన తల్లి మాతృభాషలో మాట్లాడగలరా అని విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గురువారం విలేఖర్ల సమావేశంలో పైవ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ విదేశీ మూలాలపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గతంలో పలుసార్లు విమర్శలు చేసిన విషయం విదితమే.