రాష్ట్రీయం

కర్నాటకలో ఈసారి విజయం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాదామి, మే 10: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు గురువారం బాదామి నుంచి షా రోడ్‌షో ప్రారంభించారు. షా రాక సందర్భంగా నియోజకవర్గమంతా బీజేపీ బ్యానర్లు, జెండాలతో నింపేశారు. ఉత్తర కర్నాటకలోని బాదామి నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు కాషాయం రంగు టోపీలు ధరించి ఈలలు, నృత్యాలతో అమిత్‌షాతోపాటు రోడ్‌షోలో పాల్గొన్నారు. సీఎం సిద్దరామయ్య బాదామితోపాటు మైసూరులోని ఛాముండేశ్వరి నియోజకవర్గం నుంచీ పోటీ చేస్తున్నారు. అమిత్‌షా రోడ్‌షోతో బాదామి రోడ్లన్నీ కమలనాధులతోనే కిక్కిరిసిపోయాయి. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అధికారం తమదేనని షా జోస్యం చెప్పారు. షా వెంట బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప, బాదామి బీజేపీ అభ్యర్థి బీ శ్రీరాములు ఉన్నారు. బాదామి సీటు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి ప్రతిష్టాత్మంగా మారింది. అలాగే సిద్దరామయ్య భవితవ్యం బాదామిపైనే ఆధారపడి ఉంది. ఛాముండేశ్వరి సీటుతో పాటు బాదామిని సీఎం ఎంపిక చేసుకున్నారు. ఇది కచ్చితంగా గెలిచే సీటే కాకుండా కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు చోట్లా ఓడిపోతారని అమిత్‌షా జోస్యం చెప్పారు. ఈసారి అధికార బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.