రాష్ట్రీయం

ఏపీలో సెంట్రల్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 902.07 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ వర్శిటీ, ఈ ఏడాదినుంచే తాత్కాలిక వసతుల్లో పనిచేయటం ప్రారంభిస్తుందని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని జంతలూరులో ఏర్పాటు చేస్తున్న వర్శిటీని ‘ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం’ అని పిలుస్తారన్నారు. జంతలూరులో సెంట్రల్ వర్శటీ ఏర్పాటుకు తొలి విడతగా రూ.450 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక వసతుల్లో వర్శిటీని వెంటనే ప్రారంభించేందుకు 1860 సోసైటీస్ రిజిస్ట్రేషన్
చట్టం ప్రకారం ఒక సొసైటీని ఏర్పాటు చేస్తారు. 2009 కేంద్రీయ విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేసేంతవరకు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సొసైటీ పరిధిలో పని చేస్తుంది. పరిపాలక మండలిని ఏర్పాటు చేసేంతవరకు ప్రస్తుతం పనిచేస్తున్న ఏదో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలో నడిపిస్తారు. వర్శిటీ ఏర్పాటుతో ఏపీలో నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు పెరగటంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమతూకం నెలకొంటుందని కేంద్రం పేర్కొంది.