రాష్ట్రీయం

విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: భారత్ బ్యాంకులను మోసం చేసి లండన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే విషయమై అ న్ని చర్యలను తీసుకుంటున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై చర్చల ప్రకియ కొనసాగుతోందని, కోర్టు ల్లో దీనికి సంబంధించి విచారణ తుది దశకు చేరుకుందని భావిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. కోర్టుల్లో కూడా న్యాయవాదులు సమర్ధంగా వాదనలు వినిపించారని ఆయన చెప్పారు. భారత్‌లో బ్యాంకులను రూ.9 వేల కోట్ల మేర మోసం చేసి బకాయిలు చెల్లించకుండా విజయ్ మాల్యా లం డన్‌కు ఉడాయించాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి భారత్ ఇంగ్లాండ్‌ను మాల్యాను తమకు అప్పగించాలని కోరుతోంది. మరో ఆర్థిక నేరగాడు నిరవ్ మోడీతో పాటు మాల్యా ఏ ప్రదేశంలో ఉన్నారో చెప్పలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. వీరి కోసం దర్యాప్తు చేస్తున్న సంస్థలు చెప్పినప్పుడే వివరాలు తెలుస్తాయన్నారు. మలేషియాలో ఉన్న ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు తీసుకువచ్చే విషయమై ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చర్చకు వచ్చిందా అని ప్రశ్నించగా, మలేషియా అధినేతతో మోదీ చర్చలు చాలా తక్కువసేపు జరిగాయన్నారు. సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ గత నెల 31న మలేషియాలో కొంతసేపు ఆగారు. జకీర్ నాయక్‌ను కూడా భారత్‌కు అప్పగించాలని మలేషియా ప్రభుత్వాన్ని కోరామన్నారు. మలేషియా స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఈనెల 12న ట్రంప్, కిమ్ చర్చల విషయమై అడగ్గా, ప్రపంచ శాంతి కోసం జరిగే చర్చలను భారత్ ఆహ్వానిస్తుందన్నారు.