రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు కొత్త ‘శక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వచ్చేవారం ముంబయిలో పర్యటించనున్న కాంగ్రెస్ బాస్ రాహుల్‌గాంధీ, పార్టీ శ్రేణులకు సాధికారత కల్పించే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. పార్టీకి సంబంధించి వివిధ అంశాలపై నేరుగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ‘సమాచార’ సంధాన పథకాన్ని ప్రారంభించనున్నారు. జూన్ 12న ముంబయిలో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుసుకునేందుకు ఆసక్తి చూపుతోన్న రాహుల్, ఆ సందర్భంలోనే ‘శక్తి’ని ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ‘ఇది అభినందించదగ్గ గొప్ప ప్రయత్నం. క్షేత్రస్థాయిలో పార్టీకి పునాదిలాంటి కార్యకర్తలను రాహుల్‌గాంధీ నేరుగా కలుసుకోబోతున్నారు’ అని ముంబయి కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రాజెక్టు శక్తి’ కేవలం కార్యకర్తలను నేరుగా కలుసుకోవడానికే కాదు, వాళ్ల సమస్యలు వినడానికి, వాటిని తక్షణం పరిష్కరించడానికి కూడా. దీనివల్ల ముంబయికి సంబంధించి సూక్ష్మస్థాయిలో సమస్యలు తెలుసుకోడానికీ మాకు అవకాశం ఉంటుంది’ అని నిరుపమ్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో రాహుల్ కాంటాక్ట్‌లో ఉండాలని అనుకుంటున్నారు. అందుకు ‘శక్తి’ పథకం ఉపయోగపడుతుందని అనడంలో సందేహం లేదు’ అని మా జీ ఎంపీ నిరుపమ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏడాది దూరం ఉం డగానే ఈ పథకం ప్రారంభించడం కాంగ్రెస్‌కు ఎంతో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం అటు కేంద్ర నాయక త్వం, ఇటు క్షేత్ర నాయకత్వాల మధ్య పరస్పర అవగాహనాపూరిత సంబంధాన్ని బలోపేతం చేయడానికేనని నిరుపమ్ పేర్కొన్నారు. ఈ ప్రా జెక్టులో పార్టీ కార్యకర్తలు తమ పేర్లు నమోదు చేసుకుని, కేంద్ర కమిటీ ఫోన్ నెంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచార అనుసంధానంలో ఉండొచ్చు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు తమ అభిప్రాయాలు, ఆలోచనలను కేంద్ర కమిటీకి నిక్కచ్చిగా అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది కార్యకర్తల్లోనూ మానసిక స్థైర్యాన్ని పెంచుతుందని నిరుపమ్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ముంబయికే పరిమితం చేయకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించే యోచన హైకమాండ్‌కు ఉంద ని పేర్కొన్నారు. ఒకరోజు పర్యటనకు వస్తున్న రాహుల్, గోరేగావ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బూత్‌స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. 2019 ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్‌కు జూన్ 12నాటి రాహుల్ పర్యటన ప్రాధాన్యతతో కూడినదని సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు.