రాష్ట్రీయం

అనాథలకు రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి నోటీసులు...
న్యూఢిల్లీ, జూలై 5: విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అనాథలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, ఓబిసి కేటగిరీ తరహాలో, అనాథలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఈ విషయమై తమ అభిప్రాయాలను తెలియచేయాలనికోరుతూ జస్టిస్ రంజన్ గోగాయ్, జస్టిస్ ఆర్ భానుమూర్తితో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అనాథలకు బ్యాంకులు కల్పిస్తున్న రుణాలు, ఇతర బెనిఫిట్ల గురించి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులో పేర్కొంది. అనాథలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన పౌలమి పావిని శుక్లా పిటిషన్ దాఖలుచేశారు. అనాథలు సమాజంలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరికి కులం, మతం లేదని, కాని ఆ హోదాలను ప్రభుత్వాలు బలవంతంగా రుద్దుతున్నాయన్నారు. ప్రభుత్వం అనాథలకు తల్లిదండ్రులుగా వ్యవహరించాలన్నారు. అనాథలకు కులం, మతం నిర్ణయించే విషయమై ఒక విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసే విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనాథలు 18సంవత్సరాలు నిండిన తర్వాత తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనాథల సంఖ్యను నిర్ధారించేందుకు సెనె్సస్ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వసంక్షేమ పథకాల ఫలాలు అనాథలకు అందే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అనాథల సమస్యలను అధ్యయనంచేసి సమగ్ర నివేదిక తయారు చసేంకు మండల్‌కమిషన్ తరహాలో సమగ్ర కమిషన్‌ను నియమించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.