రాష్ట్రీయం

ఈ ఏడాది చివర్లో మందిర పనులు చేపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ప్రకటించారు. రామ మందిర నిర్మాణానికి న్యాయ, రాజ్యాంగ పరమైన అవరోధాలు తొలగిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా అయోధ్య రామజన్మభూమి కేసును రోజూవారీ విచారించే విధంగా చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే జరిగితే సెప్టెంబర్ నెలాఖరునాటికి తుది ఆదేశాలు వెలువడవచ్చన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, ఈ నెల 6 నుంచి ఈ కేసు సుప్రీంకోర్టు విచారణను చేపట్టాల్సి ఉందని, కొంత ఆలస్యమైనా ఈ నెలాఖరునాటికి విచారణ మొదలవుతుందన్నారు. ఒకవేళ ఆలస్యమైన పక్షంలో మందిర నిర్మాణంపై సాధువుల సలహాను స్వీకరిస్తామన్నారు. ‘చట్టం మా వైపే ఉంది. రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుంది. సుప్రీంకోర్టు రోజూవారీ కేసు విచారణను చేపట్టాలని కోరుతున్నాం’ అని అన్నారు. అన్ని రకాల అడ్డంకులను దాటుకుని మందిర నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలన్నదే విహెచ్‌పి లక్ష్యమన్నారు. న్యాయపరంగా మా వాదనలు బలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రామమందిర నిర్మాణం అనివార్యమన్నారు. కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలు రామమందిరంతో ముడిపడి ఉన్నాయన్నారు. అర్ధరాత్రి సమయాల్లో కూడా సర్వోన్నత న్యాయస్థానం అత్యవసరమైన కేసులను విచారిస్తున్నదని ఆయన అన్నారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా న్యాయ వ్యవస్థ సత్వరమే స్పందిస్తుందనే ఆశ తమకు ఉన్నట్లు ఆయన చెప్పారు.