రాష్ట్రీయం

కొత్తగా 650 పోస్ట్‌బ్యాంక్ శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూఢిల్లీ, ఆగస్టు 1: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) సేవలు త్వరలో దేశ వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 650 శాఖలు ఏర్పాటయ్యాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ శాఖలను ప్రారంభిస్తారని కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా బుధవారం నాడిక్కడ తెలిపారు. ఐపీపీబీకి లక్షా యాభై ఐదువేల యాక్సెస్ పాయింట్లు ఏర్పాటవుతాయని, ఇందులో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 1.30లక్షల కేంద్రా లు ఏర్పాటవుతాయని, ఇవి బ్యాంకుల తరహాలోనే పనిచేస్తాయని లోక్‌సభలోప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరించారు. ఈ బ్యాంకు సేవల ప్రారంభ తేదీని రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ బ్యాంకు సేవా కేంద్రాలు చిరు వ్యాపారులు, లేదా సాధారణ వ్యక్తుల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు డిపాజిట్లను స్వీకరిస్తాయన్నారు. అలాగే ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సైతం ఏర్పాటుచేయాలని ప్రభు త్వం నిర్ణయించిందని మంత్రి మనోజ్ సిన్హా ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం 251 పాస్‌పోర్టు సేవాకేంద్రాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తునాయన్నారు. ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఓ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.