రాష్ట్రీయం

విభజన హామీల అమలు జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుపై దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా,విభజన హామీల అమలుపై ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లును సుప్రీం కోర్టు స్వీకరించింది. విభజన హామీల అమలు జాప్యంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటర్లను వారంలోగా దాఖలు చేస్తామని తెలంగాణ తరపు న్యాయవాదికి ధర్మాసనానికి తెలిపారు. న్యాయమూర్తులు జోక్యం చేసుకుని సాయంత్రంలోగా దాఖలు చేయాలేరా? అని ప్రశ్నించింది. తెలంగాణ సర్కార్ తరపున్యాయవాది వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని మరోసారి చెప్పడంతో బెంచ్ అంగీకరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు దాఖలు చేసిన అఫిడవిట్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు కావాలని ఏపీ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అన్ని కౌంటర్లు దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. గిడుగు రుద్రరాజు తరపు న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు చేయలేదని అన్నారు. గిడుగు రుద్రరాజు, చలసాని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన పిటిషన్లతో లిస్టు చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలో పూర్తిస్థాయి వాదనలు వింటామని న్యాయమూర్తులు వెల్లడించారు.