బిజినెస్

కోలుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 12: ఒడిదుడుకుల మధ్య నడుస్తూ, వరుసగా రెండు సీజన్లు నష్టాలను చవిచూసిన సెనె్సక్స్ చివరిలో కొంత వరకు మెరుగుపడింది. గత 19 నెలల్లో ఎన్నడూ లేని రీతిలో, ఒక రోజులో ఏడు వందలకుపైగా పాయింట్లు లాభపడిన సంఘటన మార్కెట్‌కు ఊతమిచ్చింది. డాలర్‌కు రూపాయి మారకపు విలువ పెరగడం, అంతర్జాతీయ వ్యాపారం తిరిగి పుంజుకోవడం వంటి అంశాలు ఈవారం చివరిలో భారత స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయి. గత ఆరు వారాల్లో మొదటిసారి సెనె్సక్స్ 366.50 పాయింట్లు, నిఫ్టీ 156.05 పాయింట్లు పెరగి, రికార్డులు ఈవారంలోనే నమోదుకావడం విశేషం. ఈ వారాంతంలో, మొత్తం మీద బలపడిన సెనె్సక్స్ 732.43 పాయింట్ల వృద్ధితో 34,733.58 పాయింట్ల వద్ద ముగిసింది. 2.32 శాతం లేదా 237.85 పాయింట్ల మేరకు పెరిగిన నిఫ్టీ 10,472.50 పాయింట్లకు చేరింది. స్థూలంగా చూస్తే, ఈవారం స్టాక్ మార్కెట్ ముగింపు ఆశాజనకంగానే కనిపించింది. రాబోయే వారం సెనె్సక్స్ మరింతగా లాభపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వారం మొదట్లో 34,376.99 పాయింట్లుగా ఉన్న సెనె్సక్స్ ఆతర్వాత పట్టుకోల్పోయి, 32,370.04 పాయింట్లకు పతనమైంది. ఆ పరిస్థితుల్లో, తదుపరి ట్రేడింగ్ మరింత దారుణంగా ఉంటుందని, స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టాలు తప్పవని విశే్లషకులు అభిప్రాయపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా చివరిలో బుల్ రన్ కొనసాగింది. మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో, లావాదేవీలు జోరందుకున్నాయి. అత్యంత ఆసక్తికరమైన వాతావరణాన్ని సృష్టించి, లాభంతో ముగిశాయి.
ఎట్టకేలకు ఊరట
వారంలో మూడు రోజులు అత్యంత నిరాశ జనకంగా కొనసాగిన స్టాక్ మార్కెట్‌కు ఊరట లభించింది. ప్రత్యేకించి భారీ నష్టాలను ఎదుర్కొన్న అయిల్ అండ్ గ్యాస్, ఆటో స్టాక్స్ మెరుగుపడి, లాభాల బాట పట్టాయి. నిజానికి ఈ వారం మొదట్లో, లావాదేవీలు మొదలైన వెంటనే, ఈ రెండు రంగాల స్టాక్స్ లావాదేవీలు ఊగిసలాడాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాలను చవిచూసి, సంస్థాగత మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో లాభాలను నమోదు చేశాయి. స్థూలంగా చూస్తే అస్తిరంగా కొనసాగినప్పటికీ, చివరిలో ఆశాజనకమైన వాతావరణాన్ని సృష్టించాయి.